కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీ నజర్

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై అవినీతి నిరోధక శాఖ ఎంట్రీ ఇచ్చింది

Update: 2025-09-30 03:36 GMT

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై అవినీతి నిరోధక శాఖ ఎంట్రీ ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తు కోరుతూ లేఖ రాసిన విజిలెన్స్ డిపార్మెంట్ పంపిన లేఖను చీఫ్ సెక్రటరీకి ఏసీబీ డీజీ పంపారు. ప్రభుత్వం నుంచి అనుమతి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై ఏసీబీ విచారణ ప్రారంభించే అవకాశం ఉందని అధికార వర్గాలు వెల్లడించాయి.

విచారణ ప్రారంభమయితే...
గతంలో కాలేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించిన ఈఎన్ సి, ఈఈ అధికారులు వద్ద భారీగా అక్రమ డబ్బును ఏసీబీ అధికారులు గుర్తించారు. వందల కోట్లఅక్రమ ఆస్తుల ఏసీబీ విచారణలో బయటపడ్డాయి. ఈ నేపథ్యంలోనే ఏసీబీ విచారణ చేపడితే మరిన్ని ఆర్థిక అక్రమాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు భావిస్తున్నారు.


Tags:    

Similar News