Breaking : మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు
తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు
తెలంగాణ నీటిపారుదల శాఖ మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధర్ రావు ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్, జహీరాబాద్, కరీంనగర్ లలో ఈ సోదాలు జరుగుతన్నాయి. మొత్తం పది చోట్ల ఏకకాలంలో ఈ సోదాలు జరుగుతున్నాయి. బంజారాహిల్స్ లోని మురళిధరరావు ఇంట్లో ఏసీబీకి చెందిన ఒక బృందం సోదాలు నిర్వహిస్తుంది.
ఈఎన్సీగా పనిచేస్తూ...
ఈఎన్సీగా పనిచేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో మురళీధరరావు ఇంట్లో ఏసీబీ సోదాలు జరుగుతున్నాయి. నీటి పారుదల శాఖలో గత ప్రభుత్వ హయాంలో పెద్దయెత్తున అవినీతి జరిగిందన్న ఆరోపణలు రావడంతో పాటు ఇప్పటికే పలువురు అధికారుల ఇళ్లలో సోదాలు జరిగాయి. ఇప్పుడు మాజీ ఇంజినీర్ ఇన్ చీఫ్ మురళీధరరావు ఇంట్లోనూ, వారి బంధువులు, సన్నిహితుల ఇళ్లలో సోదాలు జరుగుతున్నాయి.