ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక మలుపు
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది.
తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో మలుపు చోటు చేసుకుంది. స్పెషల్ ఇన్విస్టిగేషన అధికారులు తనను వేధిస్తున్నారని స్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుసుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. తనను ప్రతి రోజూ విచారణకు పిలుస్తూ తనను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. తనకు సుప్రీంకోర్టు ఇచ్చిన వెసులుబాటును విచారణ పేరుతో తొలగిస్తున్నారని ప్రభాకర్ రావు పిటీషన్ వేశారు.
ఆగస్టు 4వ తేదీకి...
మరోవైపు ప్రభాకర్ రావుకి ఇచ్చిన రిలీఫ్ కొట్టివేయాలంటూ సిట్ అధికారులు కూడా సుప్రీంకోర్టులో పిటీషన్ వేశారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు సహకరించకపోయినందునే వరసగా పిలవాల్సి వచ్చిందని వారు పిటీషన్ లో వివరించారు. ఇరు వర్గాల పిటీషన్లను స్వీకరించిన సుప్రీంకోర్టు కేసు విచారణ ఆగస్టు 4వ తేదీకి వాయిదా సుప్రీంకోర్టు వేసింది.