Telangana : కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు

Update: 2025-10-13 07:00 GMT

జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ కాంగ్రెస్ పార్టీలో చేరిక పై హాట్ కామెంట్స్ చేశారు. పార్టీకి మోసం చేసి మూటలు తీసుకుని వెళ్లిన వారికి తిరిగి పార్టీలోకి ఎంట్రీ లేదని అనిరుధ్ రెడ్డి అన్నారు. హత్యలు చేసే వారికి కాంగ్రెస్ పార్టీలో స్థానం ఉండబోదని ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి వ్యాఖ్యానించారు.

ఎర్ర శేఖర్ చేరికపై...
సొంత తమ్ముడిని చంపిన వారు రాజకీయాల కోసం తనను కూడా చంపుతారని అన్నారు. తనకు జడ్ కేటగిరీ భద్రతను కల్పించాలని, ఫ్యాక్షన్ రాజకీయాలకు తను దూరమని అనిరుధ్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఎమ్మెల్యే పదవి కోసం తనను కూడా చంపే అవకాశముందని అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. అనిరుధ్ రెడ్డి కామెంట్స్ మరోసారి కాంగ్రెస్ పార్టీలో కలకలం రేపుతున్నాయి.


Tags:    

Similar News