సింగపూర్ కు చిరంజీవి.. మార్క్ శంకర్ కోసం?

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో ప్రమాదానికి గురయ్యారు

Update: 2025-04-09 04:23 GMT

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్ లో ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే సింగపూర్ కు పవన్ కల్యాణ్ బయలుదేరి వెళ్లారు. ఈప్రమాదంలో మార్క్ శంకర్ చేతులు, కాళ్లకు గాయాలయ్యాయి. ఊపిరితిత్తుల్లోకి పొగ వెళ్లడంతో అస్వస్తతకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

పరామర్శించేందుకు...
అయితే పవన్ కల్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ గాయపడిన వార్త తెలుసుకున్న మెగా స్టార్ చిరంజీవి ఆయన సతీమణి సురేఖలు కూడా సింగపూర్ బయలుదేరి వెళ్లారు. శంకర్ ను పరామర్శించేందుకు సింగపూర్ కు ఇద్దరూ బయలుదేరి వెళ్లారు. అయితే చేతులు, కాళ్లకు స్వల్ప గాయాలు అయినా ఊపిరితిత్తల్లోకి పొగపోవడంతోనే మార్క్ శంకర్ అస్వస్థతకు గురయినట్లు వైద్యులు తెలిపారు.


Tags:    

Similar News