Breaking: తెలంగాణ మంత్రులకు శాఖల కేటాయింపు

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారంతో పాటు 11 మంది కాంగ్రెస్‌..

Update: 2023-12-09 04:17 GMT

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం కొలువుదీరింది. ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారంతో పాటు 11 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినా శాఖలు మాత్రం కేటాయించలేదు. నిన్న ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి మంత్రులకు శాఖల కేటాయిపు, ఇతర అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా మంత్రులకు శాఖలు కేటాయించారు. ఇప్పటికే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు.

ఏ మంత్రికి ఏ శాఖ..

1. భట్టి విక్రమార్క - డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ

2.దామోదర రాజనర్సింహ - ఆరోగ్యశాఖ మంత్రిగా

3.కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి - ఆర్‌అండ్‌బి

4.శ్రీధర్‌బాబు - శాసనసభా వ్యవహారాలు, ఐటీ శాఖ

5.ఉత్తమ్‌కుఆమర్‌- సివిల్‌ సప్లై, ఇరిగేషన్‌

6.పొన్నం ప్రభాకర్‌ - రవాణా శాఖ

7.సీతక్క- పంచాయతీరాజ్‌ శాఖ

8.తుమ్మల నాగేశ్వరరావు- వ్యవసాయ శాఖ

9.జూపల్లి కృష్ణారావు - ఎక్సైజ్‌ శాఖ

10.కొండా సురేఖ - అటవీశాఖ

11.పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి - సమాచార శాఖ

Tags:    

Similar News