Telangana : చీఫ్ జస్టిస్ గా ఏకే సింగ్

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఏకే సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు.

Update: 2025-07-19 07:58 GMT

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఏకే సింగ్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజభవన్ లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇటీవల తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ గా ఏకే సింగ్ నియమితులయ్యారు. అయితే ఆయన ఈరోజు రాజ్ భవన్ లో ప్రమాణ స్వీకారం చేసి పదవీ బాధ్యతలను స్వీకరించారు.

ముఖ్యమంత్రితో పాటు...
ఈ కార్యక్రమంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా హాజరయ్యారు. రాజ్ భవన్ లో జరిగిన ఈ ప్రమాణ స్వీకారానికి తెలంగణ రాష్ట్ర మంత్రులతో పాటు హైకోర్టు న్యాయమూర్తులు, ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. తర్వాత గవర్నర్ తో కలసి కాసేపు ముచ్చటించిన చీఫ్ జస్టిస్ హైకోర్టుకు వెళ్లిపోయారు.


Tags:    

Similar News