Telangana : నేడు కాళేశ్వరంపై హైకోర్టులో విచారణ

నేడు తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి కీలక విచారణ జరగనుంది

Update: 2025-10-07 02:34 GMT

నేడు తెలంగాణ హైకోర్టులో కీలక విచారణ జరగనుంది. కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం చర్యలు చేపట్టవద్దంటూ దాఖలయిన పిటీషన్ పై నేడు హైకోర్టులో విచారణ జరగనుంది. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్ రావులు వేర్వేరుగా పిటీషన్లు దాఖలు చేశారు. ప్రభుత్వం దీనిపై కౌంటర్ దాఖలు చేయడంపై నేడు విచారణ జరగనుంది.

సీబీఐకి అప్పగిస్తూ...
ఇప్పటికే ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ప్రకారం చర్యలు చేపట్టవద్దన్న దానిపై నేడు విచారణ జరగనుంది. తెలంగడాణ ప్రభుత్వం నుంచి ఏ రకమైన వాదనలు వినిపించి, కౌంటర్ దాఖలు చేస్తుందన్నది నేడు ఆసక్తిగా మారింది.


Tags:    

Similar News