Breaking : గ్రూప్ 2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట

2019 గ్రూప్ 2 అభ్యర్థులకు తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది

Update: 2025-11-27 06:08 GMT

2019 గ్రూప్ 2 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. గ్రూప్ 2 పరీక్షలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు డివిజనల్ బెంచ్ సస్పెండ్ చేసింది. 2019లో జరిగిన గ్రూప్ 2 పరీక్షలలో అవతకవలకు జరిగాయని గతంలో సింగిల్ బెంచ్ భావించి వాటిని రద్దు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును పిటీషనర్ డివిజనల్ బెంచ్ ను ఆశ్రయించారు.

సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును...
2015లో నిర్వహించిన గ్రూప్ 2 అభ్యర్థులకు 2019లో సెలక్షన్ చేసింది. అయితే సెలక్షన్ లిస్ట్ ను సింగిల్ బెంచ్ రద్దు చేసింది. ఓఎంఆర్ షీట్లలో తప్పులు జరిగాయని భావించి సింగిల్ బెంచ్ రద్దు చేసిన సెలక్షన్ లిస్ట్ పై హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే నియామకాలు కూడా జరిగిపోయాయి. ఈ వాదనలు విన్న డివిజనల్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆరు వారాలకు వాయిదా వేసింది.


Tags:    

Similar News