Road Accident : ప్రమాదానికి కారణమిదే.. 19 మంది మృతి.. మృతులు వీరే

తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది

Update: 2025-11-03 05:45 GMT

తెలంగాణ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరుగుతోంది. రోడ్డుపైన ఉన్న గుంతను తప్పించబోయిన టిప్పర్ డ్రైవర్ నేరుగా బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో పన్నెండు మంది మహిళలు, ఏడుగురు పురుషులు, ఒక చిన్నారి మరణించినట్లు ప్రాధమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. మృతుల్లో ఆర్టీసీ బస్సు డ్రైవర్ తో పాటు టిప్పర్ డ్రైవర్ కూడా మరణించాడు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని తెలిసింది. ఇరవై మందికి పైగా ప్రయాణికులకు తీవ్రగాయాలయ్యాయి. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల కుటుంబాలకు ఏడు లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రకటించారు. ప్రమాద ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించిందని తెలిపారు.

ఆర్టీసీ బస్సును ఢీకొని...
వికారాబాద్ జిల్లా తాండూరుకు చెందిన ఆర్టీసీ బస్సు వెళుతుండగా కంకర లోడుతో వెళుతున్న టిప్పర్ ఢీకొట్టింది. రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇరవై ఒక్క మంది మరణించగా, ఇరవై మందికి పైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. కంకర లోడుతో వెళుతున్న లారీ మితి మీరిన వేగంతో వెళ్లడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని తెలిపారు. ఈ ఆర్టీసీ బస్సు వికారాబాద్ నుంచి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ తో పాటు బస్సులో ప్రయాణికలు అధిక సంఖ్యలో చనిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో డెబ్భయి మంది వరకూ ఉన్నారు.
మృతుల సంఖ్య మరింత...
వెంటనే అక్కడ ఉన్న స్థానికులు, అటు వెళుతున్న వాహనదారులు సహాయక చర్యల్లో పాల్లొన్నారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. ప్రయాణికులపై కంకర పడటంతో ఊపిరాడక మరణించినట్లు తెలిసింది. బస్సు తాండూరు నుంచి హైదరాబాద్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకున్నారు. అంబులెన్స్ లు కూడా వెళ్లాయి. కానీ అప్పటికే కంకర కింద పడిన మృతదేహాలను వెలికి తీసి వికారాబాద్ ఆసుపత్రికి తరలించారు. మృతుల్లో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని తెలిసింది. సంఘటన స్థలికి మంత్రి పొన్నం ప్రభాకర్ చేరుకున్నారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు.
మృతుల వివరాలు వీరే
బస్సు డ్రైవర్ దస్తగిరి బాబా
తారిబాయ్ - దన్నారమ్ తండా
ఏమావత్ తాలీబామ్ - దన్నారమ్ తండా
కల్పన - బోరబండ
బచ్చన్ నాగమణి - భానూరు
మల్లగండ్ల హనుమంతు - దౌల్తాబాద్
గుర్రాల అభిత - యాలాల్
గోగుల గుణమ్మ - బోరబండ
షేక్ ఖలీద్ హుస్సేన్ - తాండూరు
తబస్సుమ్ జహాన్ - తాండూరు


Tags:    

Similar News