Telangana : ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యం కీలక నిర్ణయం
తెలంగాణలోని ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది
తెలంగాణలోని ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పరీక్షలను కూడా తాము బహిష్కరిస్తున్నట్లు పేర్కొంది. ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయీల నిధులు విడుదల చేసేంత వరకూ తాము ఆందోళన ఆపబోమని తెలిపింది. త్వరలోనే లక్షలాది మంది ఉద్యోగులతో సభను నిర్వహిస్తామని ప్రయివేటు కళాశాలల యాజమాన్యం ప్రకటించింది.
భారీ బహిరంగ సభ ద్వారా...
ఈ నెల 6వ తేదీన భారీ బహిరంగ సభను నిర్వమిస్తామని తెలిపింది. ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్ మెంట్ బకాయీలు విడుదల చేయకపోవడంతో తాము ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపారు. తర్వాత పది లక్షల మంది విద్యార్థులతో కలిసి సభను నిర్వహించనున్నట్లు ప్రయివేటు విద్యాసంస్థల యాజమాన్యం తెలిపింది. తమ ఆందోళనను కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు.