Telangana : నేడు బీసీ సంఘాల సమావేశం
తెలంగాణలో నేడు నేడు బీసీ సంఘాల సమావేశం జరగనుంది
నేడు బీసీ సంఘాల సమావేశం జరగనుంది. బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య అధ్యక్షతన జరగనున్న సమావేశంలో స్థానిక సంస్థల రిజర్వేషన్లపై చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి ప్రభుత్వం సిద్ధమవుతుండటం, రిజర్వేషన్లు బీసీలకు నలభై శాతం రాజ్యాంగ బద్ధంగా కల్పించకపోవడంపై చర్చించనున్నారు.
రిజర్వేషన్లపై...
ఈ సమావేశానికి ఆర్ కృష్ణయ్య అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు. పంచాయతీల్లో రిజర్వేషన్ల జీవో 46పై చర్చ చేసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు బీసీలకు నలభై శాతం రిజర్వేషన్లపై అనుమతివ్వకపోవడం, యాభై శాతానికి మించి రిజర్వేషన్లు ఉండకూడదని నిర్ణయించడంతో దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.