Telangana : మాజీ ఎమ్మెల్యే కొండా మృతి
మాజీ చేవెళ్ల ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు.
మాజీ చేవెళ్ల ఎమ్మెల్యే కొండా లక్ష్మారెడ్డి సోమవారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన వయసు 84 సంవత్సరాలు. వయో సంబంధిత అనారోగ్యంతో కొంతకాలంగా బాధపడుతూ, హైదరాబాద్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. 1980లో జర్నలిజంపై ఆసక్తితో లక్ష్మారెడ్డి ఎన్‌ఎస్‌ఎస్ అనే స్థానిక వార్తా సంస్థను స్థాపించారు. అనంతరం జూబ్లీహిల్స్ జర్నలిస్టుల సహకార గృహసమాఖ్య అధ్యక్షుడిగా, హైదరాబాద్ ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు.
చేవెళ్ల ఎమ్మెల్యేగా...
ఏకకాలంలో రాజకీయ రంగంలోనూ చురుకుగా ఉన్న కొండా లక్ష్మారెడ్డి మాజీ ఉపముఖ్యమంత్రి కొండా వెంకటరంగారెడ్డి మనవడు. ఏపీసీసీ అధికార ప్రతినిధిగా, ఫిర్యాదుల సెల్ చైర్మన్‌గా వ్యవహరించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ క్రీడా మండలి చైర్మన్‌గా కూడా పని చేశారు.1999, 2014లో హైదరాబాద్ లోక్‌సభ స్థానంలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసినా పరాజయం పాలయ్యారు