Komatireddy : కోమటిరెడ్డి కొత్త ట్విస్ట్.. ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టేందుకేనా?

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు

Update: 2025-10-14 07:03 GMT

కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. ఎక్సైజ్ పాలసీని సమీక్షించాలని కోమటిరెడ్డి కోరారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుకునేలా లిక్కర్ సిండికేట్లు వ్యవహరిస్తున్నారని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం వేళ మద్యం దుకాణాలు తెరిచి ఉండటంతో పగలు, రాత్రనక మద్యం తాగుతూ ఆర్థికంగా కుటుంబాలు నలిగిపోతున్నాయని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అన్నారు.

సాయంత్రం వేళల్లో...
అందుకే సాయంత్రం వేళల్లో మాత్రమే మద్యం షాపులు తెరిచేలా ప్రభుత్వం ఎక్సైజ్ పాలసీని మార్చాలన్నారు. మునుగోడు నియోజకవర్గంలో మాత్రం తాను ఊరిలో వైన్ షాపునకు అనుమతిచ్చే ప్రసక్తి లేదని తెలిపారు. ఊరి బయట వైన్ షాపులు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ విషయమై తాను ప్రభుత్వంతో మాట్లాడతానన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మద్యం విషయంలో తాను రాజీపడబోనని చెప్పారు.


Tags:    

Similar News