క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ ఉన్న బిల్డింగ్ లో అగ్నిప్రమాదం

Update: 2022-11-01 06:48 GMT

మహారాష్ట్రలోని పూణె నగరంలోని లుల్లానగర్ ప్రాంతంలోని ఓ భవనం పై అంతస్తులో ఉన్న రెస్టారెంట్‌లో మంటలు చెలరేగాయి. వార్తా సంస్థ ANI నివేదిక ప్రకారం, మంటలను ఆర్పడానికి మూడు ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్లు సంఘటనా స్థలంలో ఉన్నాయి. మీడియా నివేదికల ప్రకారం, ఈ భవనంలో భారత మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ రెస్టారెంట్ కూడా ఉంది. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

స్థానిక పోలీసుల కథనం ప్రకారం, పూణెలోని లుల్లానగర్ ప్రాంతంలో ఉన్న బహుళ అంతస్తుల భవనంలో మంటలు రావడంతో అక్కడ గందరగోళం నెలకొంది. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించినట్లుగా కథనాలు రాలేదు.


Tags:    

Similar News