సిరాజ్ ఫోన్ వాల్ పేపర్ లో ఏముందంటే?

భారత్ ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ ను 2-2తో సమం చేసింది. 5వ టెస్ట్ లో అద్భుతమైన విజయానికి సిరాజ్ వేసిన అద్భుతమైన స్పెల్ కారణం.

Update: 2025-08-05 09:45 GMT

భారత్ ఇంగ్లండ్ తో జరిగిన సిరీస్ ను 2-2తో సమం చేసింది. 5వ టెస్ట్ లో అద్భుతమైన విజయానికి సిరాజ్ వేసిన అద్భుతమైన స్పెల్ కారణం. ఈ సిరీస్ లో ఐదు టెస్ట్ లు ఆడిన ఏకైక ఫేస్ బౌలర్ గా సిరాజ్ నిలిచాడు. ఇక సిరాజ్ ప్రెస్ కాన్ఫరెన్స్ లో తన మొబైల్ వాల్ పేపర్ ను చూపించాడు. ఉదయం నిద్రలేవగానే.. వాల్ పేపర్ కోసం వెతికానని.. క్రిస్టియానో రొనాల్డో ఫోటోతో బీలీవ్ అని ఉండటాన్ని సెట్ చేసుకున్నానని తెలిపాడు. ప్రత్యేకంగా ఏదైనా చేయలగనని నాకు తెలుసు. ముఖ్యంగా ప్రతీ రోజు 8 గంటలకు మేల్కొంటాను. కానీ ఉదయం 6 గంటలకే నిద్ర లేచానన్నాడు సిరాజ్. ఆ క్షణం నుంచి నేను దీన్ని చేయగలనని నమ్మాను. దానిని నా వాల్ పేపర్ గా చేశాను. నమ్మకం చాలా ముఖ్యమని చెప్పుకొచ్చాడు సిరాజ్. అదే మ్యాచ్ లో చేసి చూపించాడు.

Tags:    

Similar News