నేటి పాక్ - ఇండియా మ్యాచ్ రద్దు?

ఈరోజు జరగనున్న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ రద్దయింది

Update: 2025-07-20 04:07 GMT

ఈరోజు జరగనున్న భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ రద్దయింది. ఈరోజు లెజెండ్స్ టీ20 టోర్నీలో భాగంగా ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్ జరగాల్సి ఉంది. అయితే ఇండియా ఆటగాళ్లు పాక్ తో ఆడేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. పహల్గామ్ దాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత ఈ మ్యాచ్ ఆడబోమని ఇప్పటికే కొందరు భారత ఆటగాళ్లు ప్రకటించారు.

రాత్రి 9 గంటలకు మ్యాచ్...
రాత్రి 9 గంటలకు జరగాల్సిన ఇండియా - పాక్ మ్యాచ్ కు భారత ఆటగాళ్లు దూరంగా ఉండటంతో ఈ మ్యాచ్ రద్దయినట్లు తెలిసింది. రాత్రి 9 గంటలకు ఈ మ్యాచ్ జరగాల్సి ఉండాల్సిన సమయంలో ఈ మ్యాచ్ రద్దు అయినట్లు సమాచారం. ఇప్పటికే ఈ మ్యాచ్ లో ఆడేందుకు హర్బజన్, యూసఫ్ పఠాన్ దూరంగ ఉంటామని ప్రకటించారు. తాజాగా యువరాజ్ సింగ్, సురేష్ రైనాలు కూడా తాము ఆడలేమని చెప్పడంతో మ్యాచ్ రద్దయినట్లు తెలిసింది.


Tags:    

Similar News