టైటిల్ భారత్ దే.. ఫైనల్ లో కోనేరు హంపి

ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌ టైటిల్, రన్నరప్ రెండూ భారత్ కే దక్కనున్నాయి .

Update: 2025-07-25 10:00 GMT

ఫిడే మహిళల చెస్‌ ప్రపంచకప్‌ టైటిల్, రన్నరప్ రెండూ భారత్ కే దక్కనున్నాయి . ఈ మెగాటోర్నీలో భారత యువ ప్లేయర్‌ దివ్య దేశ్‌ముఖ్‌ ఫైనల్లోకి అడుగుపెట్ట‌గా, తాజాగా కోనేరు హంపి కూడా తుదిపోరుకు అర్హత సాధించింది. సెమీస్‌ లో హంపి 5-3 తేడాతో చైనాకు చెందిన టింగ్జి లీపై విజయం సాధించింది. తొలి రెండు గేములు స్కోర్లు సమం కావడంతో విజేతను నిర్ణయించడానికి టైబ్రేక్‌కు దారితీసింది. ఇక్కడ హంపీ అద్భుతంగా ఆడి విజయాన్ని అందుకుంది. జులై 26, 27 తేదీల్లో టోర్నీ ఫైనల్‌ జ‌ర‌గ‌నుంది. ఇప్ప‌టికే ఫైన‌ల్ చేరిన మ‌రో ఇండియ‌న్ ప్లేయ‌ర్ దివ్య దేశ్‌ముఖ్‌తో హంపి త‌ల‌ప‌డనుంది.

Tags:    

Similar News