Bengaluru : చిన్న స్వామి స్టేడియంలో తొక్కిసలాట.. ఇద్దరికి గాయాలు

బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది.

Update: 2025-06-04 11:43 GMT

బెంగళూరులోని చిన్న స్వామి స్టేడియంలో తొక్కిసలాట జరిగింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విక్టరీ పరేడ్ ముగించుకుని విధాన సౌధ నుంచి చిన్న స్వామి స్టేడియానికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యులు రానున్నారు. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను కలసిన అనంతరం ఊరేగింపుగా చిన్న స్వామి స్టేడియంకు రావాల్సి ఉంది. చిన్న స్వామి స్టేడియానికి పెద్ద సంఖ్యలో తరలి రావడంతో వారిని అదుపు చేయడంలో కర్ణాటక పోలీసులు విఫలమయ్యారు. స్వల్పంగా లాఠీఛార్జీ కూడా చేశారు.

పరేడ్ రద్దు చేసి...
అయితే భద్రతా కారణాల దృష్ట్యా విక్టరీ పరేడ్ ను ప్రభుత్వం రద్దు చేసింది. కేవలం చిన్న స్వామి స్టేడియంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు సభ్యులకు సన్మాన కార్యక్రమం జరుగుతుంది. అయితే స్టేడియానికి జట్టు సభ్యులు వస్తారని తెలిసిన అభిమానులు పెద్దయెత్తున తరలి రావడంతో తొక్కిసలాట జరిగింది. దీంతో ఇద్దరికి తొక్కిసలాటలో గాయాలయ్యాయి. తొక్కిసలాటలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బెంగళూరు ఎయిర్ పోర్టులో ఆర్సీబీ జట్టుకు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్వాగతం పలికారు.


Tags:    

Similar News