క్యూ లైన్ లో క్రికెటర్.. రెండు రోజుల నుండి నిల్చునే ఉన్నాడట..!

ఈ ఏడాది ఆగస్టులో జరిగే ఆసియా కప్ 2022కి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాటు ఇంధన కొరతను ఎదుర్కొంటోంది.

Update: 2022-07-16 05:50 GMT

శ్రీలంకలో పరిస్థితులు ఎంత దారుణంగా తయారవుతూ ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు రాజకీయ సంక్షోభం, మరో వైపు ఆర్థికంగా కుదేలు..! నిత్యావసర వస్తువులు కూడా దక్కక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అయితే ఈ కష్టాలు సాధారణ ప్రజలకు మాత్రమే అనుకుంటే పొరపాటు. పాపం ఆ దేశ క్రికెటర్లు కూడా ఎంతగానో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. పెట్రోల్-డీజిల్ కోసం వాళ్లు కూడా గంటలు గంటలు క్యూ లైన్ లో నిలబడాల్సి వస్తోంది.

శ్రీలంక క్రికెటర్ చమిక కరుణరత్నే రెండు రోజుల తర్వాత తన కారులో ఇంధనాన్ని నింపడానికి పెట్రోల్ పంప్ వద్ద సుదీర్ఘ క్యూలో వేచి ఉన్నాడు. 2019లో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన యువ అంతర్జాతీయ క్రికెటర్.. తన దేశంలో ఇటీవల చోటు చేసుకున్న సంక్షోభంతో కలత చెందాడు. శనివారం ANIతో ప్రత్యేకంగా మాట్లాడుతూ, "రెండు రోజుల పాటు క్యూలో ఉన్న తర్వాత అదృష్టవశాత్తూ లభించింది, భారీ ఇంధన సంక్షోభం కారణంగా నేను నా క్రికెట్ ప్రాక్టీస్‌కు కూడా వెళ్ళలేకపోతున్నాను" అని చెప్పాడు.
ఈ ఏడాది ఆగస్టులో జరిగే ఆసియా కప్ 2022కి శ్రీలంక ఆతిథ్యం ఇవ్వనుంది. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఆ దేశం తీవ్ర ఆర్థిక సంక్షోభంతో పాటు ఇంధన కొరతను ఎదుర్కొంటోంది. ఏం జరుగుతుందో తెలియట్లేదని అంటున్నారు. త్వరలోనే శ్రీలంకలో రెండు ముఖ్యమైన సిరీస్‌లు ఉన్నాయని చమిక కరుణరత్నే చెప్పుకొచ్చాడు. లంక ప్రీమియర్ లీగ్ (ఎల్‌పిఎల్) మ్యాచ్‌లు ప్రకటించారని.. అందుకోసం ప్రాక్టీస్ కూడా ముఖ్యమని తెలిపాడు. "ఆసియా కప్ వస్తోంది. ఈ సంవత్సరం LPL కూడా షెడ్యూల్ చేశారు. నేను ప్రాక్టీస్ కోసం కొలంబో, వివిధ ప్రాంతాలకు వెళ్లి క్లబ్ సీజన్‌కు హాజరు కావాలి కాబట్టి ఏమి జరుగుతుందో నాకు తెలియదు. ఇంధన కొరత కారణంగా నేను ప్రాక్టీస్‌లకు వెళ్లలేకపోతున్నాను. రెండు రోజుల నుంచి నేను ఎక్కడికీ వెళ్లలేదు.. ఎందుకంటే.. పెట్రోలు కోసం చాలా క్యూలో ఉన్నాను. అదృష్టవశాత్తూ ఈ రోజు నాకు దొరికింది"అని అతను ANI కి చెప్పాడు. "మేము ఆసియా కప్‌కు సిద్ధంగా ఉన్నాము. పెద్ద ఈవెంట్‌కు దేశం తగినంత ఇంధనాన్ని అందిస్తుందని నేను భావిస్తున్నాను. మేము ఆస్ట్రేలియాతో ఆడుతున్నాము. మ్యాచ్‌లు బాగా సాగుతున్నాయి. ఆసియా కప్‌కు కూడా సన్నాహాలు జరుగుతున్నాయి" అని అతను చెప్పుకొచ్చాడు.


Tags:    

Similar News