IPl 2026 : ఐపీఎల్ లో నేడు డబుల్ బొనాంజా
వీకెండ్ కావడంతో నేడు ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి
ఐపీఎల్ లో నేడు శనివారం కావడంతో క్రికెట్ ప్రేమికులకు డబుల్ బొనాంజా. ఈరోజు రెండు మ్యాచ్ లు అలరించనున్నాయి. మధ్యాహ్నం 3.30 గంటలకు పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ జరగనుంది. ఛండీగఢ్ వేదికగా ఈ మ్యాచ్ జరగనుంది. పంజాబ్ కింగ్స్ మూడు మ్యాచ్ లు ఆడగా రెండు మ్యాచ్ లలో గెలిచి, ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దు కావడంతో ఐదు పాయింట్లతో ఉంది. హైదరాబాద్ సన్ రైజర్స్ మాత్రం మొత్తం మూడు మ్యాచ్ లు ఆడితే అందులో రెండు మ్యాచ్ లు ఓడి, ఒక మ్యాచ్ ఓడి రెండు పాయింట్లతో ఉంది.
చెన్నై వర్సెస్ ఢిల్లీ...
మరొక ఇంట్రెస్టింగ్ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు జరగనుంది. చెన్నై వేదికగా చెన్నై సూపర్ కింగ్స్ ఢిల్లీ కాపిటల్స్ తో తలపడనుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటి వరకూ మూడు మ్యాచ్ లు ఆడి మూడు మ్యాచ్ లలో ఓడిపోయి పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ కాపిటల్స్ మాత్రం మూడు మ్యాచ్ లు ఆడి రెండు మ్యాచ్ లలో గెలిచి ఒక మ్యాచ్ లో ఒక్క పరుగుతో ఓటమి పాలయి నాలుగు పాయింట్లతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారన్నది ఆసక్తికరంగా మారింది.