సరికొత్త చరిత్ర.. క్వార్టర్స్ లో అందరూ భారతీయులే

చెస్ లో భారత మహిళలు దుమ్మురేపుతున్నారు. భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలీ రమేశ్‌ బాబు, దివ్యా దేశ్‌ముఖ్‌ ఫిడే మహిళల చెస్‌ వరల్డ్‌ కప్‌లో సత్తా చాటారు.

Update: 2025-07-19 12:05 GMT

చెస్ లో భారత మహిళలు దుమ్మురేపుతున్నారు. భారత గ్రాండ్‌మాస్టర్లు కోనేరు హంపి, ద్రోణవల్లి హారిక, వైశాలీ రమేశ్‌ బాబు, దివ్యా దేశ్‌ముఖ్‌ ఫిడే మహిళల చెస్‌ వరల్డ్‌ కప్‌లో సత్తా చాటారు. ఈ నలుగురు క్వార్టర్‌ఫైనల్‌కు చేరారు. ఒకే దేశానికి చెందిన నలుగురు క్రీడాకారిణులు క్వార్టర్స్‌ చేరడం టోర్నీ చరిత్రలో ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రీక్వార్టర్‌ఫైనల్‌ టైబ్రేకర్లలో స్విట్జర్లాండ్‌ కు చెందిన అలెగ్జాండ్రా కొస్టెన్యూక్‌ ని హంపి, రష్యా గ్రాండ్‌మాస్టర్‌ క్యాటరీనా లగ్నోని హారిక ఓడించారు. కజకిస్థాన్ కు చెందిన కమలిదెనోవా ను వైశాలి ఓడించగా, చైనాకు చెందిన రెండో సీడ్‌ జు ఝినెర్‌పై దివ్య విజయం సాధించారు. ఈ టోర్నీలో టాప్-3 లో నిలిచే వారు క్యాండిడేట్ టోర్నీకి అర్హత సాధిస్తారు.

Tags:    

Similar News