దినేష్ కార్తీక్ ను క్లీన్ బౌల్డ్ చేసిన షమీ

Update: 2022-10-17 02:07 GMT

భారత జట్టు టీ-20 ప్రపంచ కప్ కు సమాయత్తమవుతోంది. అందుకు తగ్గట్టుగానే నెట్స్ లో ప్రాక్టీస్ ను ముమ్మరం చేశారు భారత ఆటగాళ్లు. చాలా రోజుల తర్వాత భారత జట్టులోకి వచ్చిన మొహమ్మద్ షమీని అందరూ ఆసక్తికరంగా గమనిస్తూ వస్తున్నారు. షమీ ముఖ్యంగా బుమ్రా లేని లోటును భర్తీ చేయాల్సి ఉందని అందరూ భావిస్తున్నారు. ప్రాక్టీస్ లో షమీ దినేష్ కార్తీక్ ను క్లీన్ బౌల్డ్ చేయడం విశేషం.

T20 ప్రపంచ కప్ 2022 కోసం చివరి నిమిషంలో గాయపడిన జస్ప్రీత్ బుమ్రా స్థానంలో భారత క్రికెట్ జట్టు సీనియర్ ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ ని దింపారు. గబ్బాలో భారత్ నెట్ సెషన్‌లో ఫామ్‌లో ఉన్న ఫినిషర్ దినేష్ కార్తీక్‌ను తన బౌలింగ్ తో బోల్తా కొట్టించాడు. కోవిడ్ నుండి కోలుకున్న తర్వాత ఇటీవల ఆస్ట్రేలియాలో జట్టుతో భారత జతకట్టిన మహ్మద్ షమీ, ఆదివారం బ్రిస్బేన్‌లో జరిగిన జట్టు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొన్నప్పుడు నెట్స్‌లో బౌలింగ్ చేయడం ప్రారంభించాడు. నెట్ ప్రాక్టీస్ సమయంలో దినేష్ కార్తీక్‌ను క్లీన్ బౌల్డ్ చేశాడు, కార్తీక్ స్కూప్ కోసం ప్రయత్నించగా.. షమీ మాత్రం ఆ ఛాన్స్ ఇవ్వలేదు.
డిఫెండింగ్ ఛాంపియన్స్, ఆతిథ్య ఆస్ట్రేలియాతో సోమవారం జరిగే టీ20 ప్రపంచకప్ వార్మప్ మ్యాచ్‌లో భారత జట్టు పోరాడడానికి సిద్ధంగా ఉంది. రోహిత్ శర్మ నేతృత్వంలోని టీమిండియా శనివారం బ్రిస్బేన్‌లో అడుగుపెట్టింది, అక్టోబర్ 17, 19 తేదీల్లో వరుసగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లతో రెండు వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నారు. దీనికి ముందు వెస్ట్రన్ ఆస్ట్రేలియాతో భారత్ రెండు వార్మప్ గేమ్‌లను ఆడింది. తొలి మ్యాచ్‌లో గెలిచిన భారత్.. రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది.


Tags:    

Similar News