మెస్సి పాదం.. 8000 కోట్లు

ఫుట్‌బాల్‌ లెజెండ్ మెస్సీ భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో మెస్సి ఒక్క ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ కూడా ఆడలేదు.

Update: 2025-12-16 15:00 GMT

ఫుట్‌బాల్‌ లెజెండ్ మెస్సీ భారత్‌లో పర్యటించారు. ఈ పర్యటనలో మెస్సి ఒక్క ఎగ్జిబిషన్‌ మ్యాచ్‌ కూడా ఆడలేదు. అందుకు కారణం ఆయన ఎడమ పాదానికి చేయించుకున్న బీమా అని అంటున్నారు. ఈ బీమా విలువ అక్షరాలా 900 మిలియన్‌ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు 8 వేల కోట్లు. మ్యాచ్‌ ఆడుతూ మైదానంలో అతని పాదానికి గాయమైతే బీమా సంస్థ బాధ్యత తీసుకుంటుంది. అయితే ఈ బీమాలో ఉన్న షరతుల ప్రకారం ఇది జాతీయ జట్టు అయిన అర్జెంటీనా లేదా తన క్లబ్‌ జట్టు తరఫున ఆడుతున్నప్పుడు మాత్రమే ఈ బీమా సౌకర్యం వర్తిస్తుంది. పొరపాటున ఇతర సందర్భాల్లో గాయమైతే ఇది వర్తించకపోగా, న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురవుతాయట. బీమా పొందాలంటే షరతులు వర్తిస్తాయని చెబుతారు.. అది ఇదేనేమో!!

Tags:    

Similar News