Breaking : టెస్ట్ క్రికెట్ కు విరాట్ గుడ్ బై

కింగ్ విరాట్ కోహ్లి రిటైర్ మెంట్ ప్రకటించారు. టెస్ట్ క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు

Update: 2025-05-12 06:32 GMT

కింగ్ విరాట్ కోహ్లి రిటైర్ మెంట్ ప్రకటించారు. టెస్ట్ క్రికెట్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఇటీవల టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు. ఇప్పుడు విరాట్ కోహ్లి కూడా రిటైర్ మెంట్ ప్రకటించడంతో సీనియర్ ఆటగాళ్లు ఇక టెస్ట్ క్రికెట్ లో కనిపించరు. రోహిత్ శర్మ రిటైర్ మెంట్ ప్రకటన రాగానే విరాట్ కోహ్లి కూడా రిటైర్ అవుతారని అనుకున్నారు. అయితే కోహ్లీ రిటైర్ మెంట్ పై బీసీసీఐ ఒప్పుకోలేదని కూడా వార్తలు వచ్చాయి.

ఇక సీనియర్లు లేని...
విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ లేకుండానే ఇక టీం ఇండియా టెస్ట్ లను ఆడబోతుంది. టెస్ట్ లకు భారత కెప్టెన్ గా శుభమన్ గిల్, వైఎస్ కెప్టెన్ గా రిషబ్ పంత్ వ్యవహరిస్తారని, బీసీసీఐ నుంచి ప్రకటన అధికారికంగా వస్తుందని అనుకున్న సమయంలో విరాట్ కోహ్లి ఈ టెస్ట్ క్రికెట్ కు రిటైర్ మెంట్ ప్రకటించడం భారత క్రికెట్ అభిమానులకు ఊహించని షాక్ అని చెప్పాలి. తెలుపు రంగు జెర్సీల్లో కోహ్లీ ఆటను మనం చూసే అవకాశం లేదని కింగ్ అభిమానులు కుంగిపోతున్నారు.


Tags:    

Similar News