నిజంగా బ్యాడ్ న్యూస్.. అతడు వరల్డ్ కప్ ఆడట్లేదు..!

గాయం ఊహించిన దానికంటే చాలా పెద్దదని తేలింది. ఈ ఏడాది జూలై నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా

Update: 2022-10-03 15:41 GMT

భారత క్రికెట్ అభిమానులకు బ్యాడ్ న్యూస్. ఎక్కడో చిన్న హోప్ కాస్తా ఈరోజు బీసీసీఐ ప్రకటనతో నాశనం అయిపోయింది. భారత జట్టు ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఈ ఏడాది ఆస్ట్రేలియాలో జరగబోయే ప్రపంచకప్ కు దూరమవుతున్నాడని అధికారిక ప్రకటన బీసీసీఐ నుండి వచ్చింది. బీసీసీఐ మంగళవారం ట్విట్టర్ ద్వారా బుమ్రా టోర్నమెంట్ లో ఆడకపోవడాన్ని ధృవీకరించింది. నిపుణులతో సంప్రదింపుల అనంతరం నిర్ణయం తీసుకున్నారు. వెన్ను గాయం కారణంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న 3-మ్యాచ్‌ల T20I సిరీస్‌కు బుమ్రా మొదట దూరమయ్యాడు. అయితే ప్రపంచ కప్ మొదలయ్యే లోపు బుమ్రా రెడీ అవుతాడని అందరూ భావించినా.. అలాంటిదేమీ జరగకపోవచ్చని బీసీసీఐ ప్రకటనతో అర్థం అవుతోంది. అతడి స్థానంలో ఎవరు ఆడతారా అనే విషయంలో అధికారిక ప్రకటన రాలేదు. అయితే మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ భారత జట్టుతో పాటు ప్రయాణిస్తారని వార్తలు వచ్చాయి.

28 ఏళ్ల పేసర్ ప్రపంచకప్ టోర్నమెంట్ ప్రారంభానికి ముందే ఫిట్‌గా అవుతాడని బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ, టీమ్ ఇండియా హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ ఇద్దరూ ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే, గాయం ఊహించిన దానికంటే చాలా పెద్దదని తేలింది. ఈ ఏడాది జూలై నుంచి అంతర్జాతీయ క్రికెట్‌కు దూరంగా ఉన్న బుమ్రా వెన్ను గాయం కారణంగా UAEలో జరిగిన T20 ఆసియా కప్‌కు దూరమయ్యాడు. ఆ తర్వాత అతను నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో భాగమయ్యాడు. బుమ్రా ఆస్ట్రేలియాతో జరిగే మూడు మ్యాచ్‌ల T20I సిరీస్‌కు ఫిట్‌గా ప్రకటించబడ్డాడు. అతను మొహాలీలో మొదటి గేమ్ ఆడలేదు, కానీ నాగ్‌పూర్, హైదరాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లలో ఆడాడు. ఆ తర్వాత గాయం తిరగదోడడంతో మనమందరం బ్యాడ్ న్యూస్ వినాల్సి వచ్చింది.


Tags:    

Similar News