దయచేసి ఎవరినీ నిందించొద్దంటున్న ఇర్ఫాన్ పఠాన్

ఓ అభిమాని చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. అతడు ఈ లీగుల్లో ఇర్ఫాన్ పఠాన్ చూసిన ప్రతీసారీ నాకు ఎంఎస్

Update: 2022-09-30 08:48 GMT

ఇర్ఫాన్ పఠాన్.. ఎంతో అద్భుతమైన ట్యాలెంట్ ఉన్న ఆల్ రౌండర్..! కానీ ఊహించని విధంగా జట్టుకు దూరమవ్వడం అతడి అభిమానులకు ఎంతో బాధను కలిగించింది. అటు వన్ డౌన్ లోనూ రాగలడు.. ఇటు ఆఖరులోనూ హిట్టింగ్ చేయగలడు ఇర్ఫాన్ పఠాన్. మంచి ఆల్ రౌండర్ భారత జట్టులో ఎక్కువ కాలం ఉండలేకపోయాడు. ఇప్పుడు లెజెండ్స్ లీగ్ లో ఇర్ఫాన్ పఠాన్ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి ఇండియా లెజెండ్స్ జట్టును ఫైనల్ కు చేర్చాడు. సెమీ ఫైనల్లో ఇండియా లెజెండ్స్ ఐదు వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా లెజెండ్స్ పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 171/5 స్కోరు చేసింది. లక్ష్య ఛేదనకు వచ్చిన ఇండియా లెజెండ్స్ 19.2 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించి గెలిచింది. భారత మాజీ వికెట్ కీపర్ నమన్‌ ఓజా (62 బంతుల్లో 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 90) భారీ షాట్లతో సత్తా చాటి జట్టును గెలిపించాడు. అతనితో పాటు ఇర్ఫాన్‌ పఠాన్‌ (37 నాటౌట్‌) కూడా రాణించాడు. ముఖ్యంగా ఇర్ఫాన్ ఇన్నింగ్స్ తో భారత్ విజయాన్ని సాధించింది. అద్భుతమైన సిక్సర్లను ఇర్ఫాన్ ఈ ఇన్నింగ్స్ లో బాదాడు.

ఓ అభిమాని చేసిన ట్వీట్ హాట్ టాపిక్ గా మారింది. అతడు ''ఈ లీగుల్లో ఇర్ఫాన్ పఠాన్ ను చూసిన ప్రతీసారీ నాకు ఎంఎస్ ( మహేంద్ర సింగ్ ధోనీ), ఆయన మేనేజ్‌మెంట్‌పై మరింత కోపం వతుంది. ఇలాంటి ప్లేయర్ తన 29 ఏళ్ల వయసులో చివరి వైట్ బాల్ మ్యాచ్ ఆడాడంటే నమ్మశక్యంగా లేదు. నెం.7 ప్లేస్‌లో పఠాన్‌ పర్ఫెక్ట్ ప్లేయర్. ఏ టీమ్‌ అయినా ఇలాంటి ప్లేయర్ కావాలని కోరుకుంటుంది. కానీ ఇండియా మాత్రం జడ్డూని ఆడించింది. చివరికి బిన్నీని కూడా'' అంటూ ట్వీట్ చేశాడు. అభిమాని ట్వీట్‌పై ఇర్ఫాన్ పఠాన్ చాలా హుందాగా స్పందించాడు. 'దయచేసి ఎవ్వరిని నిందించొద్దు.. కానీ నీ ప్రేమకు థ్యాంక్యూ' అంటూ కామెంట్ చేశాడు. పఠాన్‌ తాను ఆడిన ఆఖరి వన్డేలో 5 వికెట్లు తీసినప్పటికి 2012 తర్వాత భారత జట్టులో స్థానం దక్కించుకోలేకపోయాడు. 27 ఏళ్ల వయసులో చివరిగా భారత జట్టుకి ఆడిన ఇర్ఫాన్ పఠాన్, దాదాపు 8 ఏళ్లు ఎదురుచూసి 2020లో రిటైర్మెంట్ ప్రకటించాడు.


Similar News