ఐపీఎల్ కు రవిచంద్రన్‌ అశ్విన్‌ గుడ్‌బై

ఐపీఎల్‌కు భారత స్టార్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ గుడ్‌బై చెప్పారు.

Update: 2025-08-27 07:38 GMT

ఐపీఎల్‌కు భారత స్టార్‌ బౌలర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ గుడ్‌బై చెప్పారు. చెన్నై సూపర్ కింగ్స్ తో చివరి సారిగా ఆడిన అశ్విన్ ఇప్పటికే వన్డే, టెస్ట్, టీ20 మ్యాచ్ లకు గుడ్ బై చెప్పారు. అయితే ఐపీఎల్ లో మాత్రం రవిచంద్రన్‌ అశ్విన్‌ ఆడుతున్నారు. సీనియర్ ఆటగాడైన రవిచంద్రన్ అశ్విన్ అనేక వికెట్లు తీసి ఐపీఎల్ లోనూ సత్తా చాటాడు.

సీఎస్కే తరుపున ఆడి...
చివరిసారిగా సీఎస్‌కే తరఫున ఐపీఎల్‌ టోర్నీ ఆడిన అశ్విన్‌ ఐపీఎల్‌లో పలు ఫ్రాంచైజీల తరఫున ఆడాడు. ఐపీఎల్ లో మొత్తం 21 మ్యాచ్ లలో ఆడిన రవిచంద్రన్ అశ్విన్ 187 వికెట్లు తీశాడు. తన స్పిన్ మాయాజాలంతో పరుగులు ఇవ్వకుండా పొదుపు చేయడం, అవసరమైన సమయంలో వికెట్లు తీయడం రవిచంద్రన్‌ అశ్విన్‌ సొంతమనే చెప్పాలి.


Tags:    

Similar News