India vs South Africa Second Test : నేటి నుంచి రెండో టెస్ట్
భారత్ నేటి నుంచి దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌లో తలపడబోతుంది. కేప్‌టౌన్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది
india will face south africa in the second test from today.
భారత్ నేటి నుంచి దక్షిణాఫ్రికాతో రెండో టెస్ట్‌లో తలపడబోతుంది. కేప్‌టౌన్ వేదికగా ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. తొలి టెస్ట్ లో కేవలం 34 పరుగులతో ఓటమి పాలయిన భారత్ రెండో టెస్ట్ మ్యాచ్ లోనైనా గెలవాలని భావిస్తుంది. దక్షిణాఫ్రికా కూడా ఈ మ్యాచ్ ను సొంతం చేసుకుని సిరీస్ ను గెలవాలన్న కసితో ఉంది. సొంత గడ్డ కావడంతో దక్షిణాఫ్రికాకే ఎక్కువ ఛాన్స్‌లు ఉన్నాయని క్రీడా పండితులు చెబుతున్నారు. కేప్‌టౌన్ పిచ్ కూడా అంత సులువు కాదని చెబుతున్నారు.
ఇద్దరూ రాణిస్తేనే....
తొలి టెస్ట్ లో మన బౌలర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీంతోనే ఓటమి పాలు కావాల్సి వచ్చింది. ఈ టెస్ట్‌లో బ్యాటర్లు, బౌలర్లు రాణించాల్సి ఉంటుంది. అప్పుడే భారత్ కు విజయం సాధ్యమవుతుంది. నిలకడగా ఆడుతూ బంతి అంది వచ్చినప్పుడు మాత్రమే బ్యాట్ కు కనెక్ట్ చేస్తేనే పరుగులు లభిస్తాయి. వికెట్లు కోల్పోకుండా ఎక్కువ స్కోరు చేసే వీలుంటుందన్న అభిప్రాయం వ్యక్తం అవుతుంది. అందుకే ఈ టెస్ట్ మ్యాచ్‌లోనైనా భారత్ బౌలర్లు, బ్యాటర్లు రాణించాలని కోరుకుందాం.