BCCI : నేడు టీ20 వరల్డ్ కప్ కు భారత్ జట్టు ప్రకటన
టీ20 వరల్డ్ కప్ కు భారత్ జట్టును నడు ప్రకటించనుంది
టీ20 వరల్డ్ కప్ కు భారత్ జట్టును నడు ప్రకటించనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకుటీ20 వరల్డ్ కప్ స్వ్కాడ్ ను బీసీసీఐ ప్రకటించనుంది. త్వరలోజరగనున్న వరల్డ్ కప్ కు ఆడే భారత్ జట్టును బీసీసీఐ ప్రకటించనుండటంతో ఎవరిని ఇన్ ఎవరు అవుట్ అన్న టెన్షన్ నెలకొంది. శుభమన్ గిల్ ప్రస్తుతం ఫామ్ లో లేకపోవడంతో పాటు గాయం కారణంగా సౌతాఫ్రికాతో జరిగిన చివరి రెండు మ్యాచ్ ల నుంచి తప్పించింది. అయితే వరల్డ్ కప్ కు కూడా గిల్ కు అవకాశం ఉండకపోవచ్చంటున్నారు.
కొందరిని తప్పించి...
గిల్ ను తప్పించి యశస్వి జైశ్వాల్ లేదా ఇషాన్ కిషన్ కు అవకాశమివ్వనున్నారా? అన్న చర్చ జరుగుతుంద.ి అలాగే జితేశ్ తో పాటు సంజూ శాంసన్ కు కూడా చోటుదక్కనుంది. ఆల్ రౌండర్లుగా హార్ధిక్ పాండ్యా, శివమ్ దూబె, అక్షర్ పటేల్ లు ఉండనున్నారు. జస్ప్రిత్ బుమ్రా, అర్ష్ దీప్ సింగ్, హర్షిత్ రాణాలకు కూడా అవకాశం దక్కనుందని అంటున్నారు. కులదీప్ యాదవ్ కు కూడా చోటు దక్కనుంది. మొత్తం మీద బీసీసీఐ ఎవరి పేరును ప్రకటిస్తుందన్నది మాత్రం ఆసక్తికరంగా మారనుంది.