Asia Cup : భారత్ - పాక్ లు మూడుసార్లు తలపడే అవకాశాలు ఎంత వరకూ ఉన్నాయి?

భారీ ఉత్కంఠ మధ్య మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఆసియా కప్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది భారత్ – పాకిస్థాన్ పోరు

Update: 2025-09-08 02:23 GMT

భారీ ఉత్కంఠ మధ్య మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఆసియా కప్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచేది భారత్ – పాకిస్థాన్ పోరు. ఇటీవల మేలో జరిగిన సైనిక ఘర్షణ తర్వాత ఇరు జట్లు క్రికెట్ మైదానంలో తొలిసారి తలపడుతున్నాయి. ఈ ట్వెంటీ20 టోర్నమెంట్ రాబోయే ఫిబ్రవరి–మార్చిలో భారత్, శ్రీలంకల్లో జరగబోయే టీ20 వరల్డ్ కప్‌కి సన్నద్ధతగా ఉపయోగపడుతుందన్నది వాస్తవం. ఎనిమిది జట్ల ఈవెంట్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘానిస్తాన్ – హాంగ్‌కాంగ్ జట్లు అబుదాబీలో తలపడతాయి.

తొలి మ్యాచ్ ...
భారత్ – పాకిస్థాన్ పోరు సెప్టెంబర్ 14న దుబాయ్‌లో జరగనుంది. ఈ సందర్భంగా పాకిస్థాన్ బౌలింగ్ లెజెండ్ వసీం అక్రమ్ అభిమానులు, ఆటగాళ్లు క్రమశిక్షణ పాటించాలని, హద్దులు దాటకూడదని సూచించారు. 2012 తర్వాత భారత్, పాకిస్థాన్ తమ తమ మైదానాల్లో ద్వైపాక్షిక సిరీస్ ఆడలేదు. అంతర్జాతీయ టోర్నమెంట్‌లలో మాత్రమే తటస్థ వేదికపై తలపడుతున్నారు. ఈసారి ఇరు జట్లు ఒకే గ్రూపులో ఉండటంతో గరిష్టంగా మూడు సార్లు తలపడే అవకాశం ఉంది. ఫైనల్ సెప్టెంబర్ 28న దుబాయ్‌లో జరగనుంది.
ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల తర్వాత...
పహాల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సింధూర్ తర్వాత జరుగుతున్న మ్యాచ్ కావడంతో ఇరు దేశాల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఈ క్రికెట్ మ్యాచ్‌లపై భారతల్ ఇప్పటికే నిరసనలు వ్యక్తమయ్యాయి. మాజీ భారత స్పిన్నర్ హర్భజన్ సింగ్ “సరిహద్దులో రక్తపాతం జరుగుతుంటే మైదానంలో కలిసి ఆటలు ఆడలేం. ముందుగా పెద్ద సమస్యలు పరిష్కారం కావాలి. క్రికెట్ చిన్న విషయం మాత్రమే” అని వ్యాఖ్యానించారు. క్రికెట్ పరంగా చూస్తే, భారత్ టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో పాకిస్థాన్‌పై జరిగిన పదమూడు మ్యాచ్ లలో భారత్ పది మ్యాచ్ లలో గెలిస్త, పాక్ కేవలం మూడు మ్యాచ్ లలో మాత్రమే గెలిచింది.
ఫేవరెట్ గా భారత్...
సూర్యకుమార్ యాదవ్ సారథ్యంలో బరిలోకి దిగుతున్న భారత జట్టు ఈ ఛాంపియన్ ట్రోఫీలో ఫేవరేట్‌గా నిలుస్తోంది. పాకిస్థాన్ జట్టులో స్టార్ ఆటగాళ్లు బాబర్ ఆజమ్, మహ్మద్ రిజ్వాన్ ఫామ్ లేకపోవడంతో వారిని జట్టు నుంచి తొలగించారు. 2023లో జరిగిన గత ఆసియా కప్ లో వన్డే మ్యాచ్ లో భారత్ ఫైనల్లో శ్రీలంకను ఓడించి టైటిల్ గెలుచుకుంది. ఈసారి కూడా ఛాంపియన్ షిప్ ను దక్కించుకునే అవకాశాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అంచనాలు అధికంగా ఉండటంతో పాక్ - భారత్ మ్యాచ్ పై ఎక్కువగా రెండు దేశాల జట్ల కు చెందిన అభిమానులు హోప్స్ భారీగా పెట్టుకున్నారు. మరి మైదానంలో ఎవరిది పై చేయి అవుతుందన్నది మరో ఆరు రోజుల్లో తేలనుంది.


Tags:    

Similar News