Team India : అన్నారంటే ట్రోల్ చేశారంటారు కానీ.. ఎప్పుడు మార్చుకుంటారో ఏమో? ఎందుకొస్తారో.. ఏమో?

దక్షిణాఫ్రికాతో జరిగిన ఇండియా టీ 20 మ్యాచ్ ఓటమి పాలయింది. బ్యాటర్లలో ఓపెనర్లు ఇద్దరూ విఫలమయ్యారు

Update: 2023-12-13 03:43 GMT

 Arshdeep singh Jitesh sharma

దక్షిణాఫ్రికాతో జరిగిన ఇండియా టీ 20 మ్యాచ్ ఓటమి పాలయింది. బ్యాటర్లలో ఓపెనర్లు ఇద్దరూ విఫలమయ్యారు. ఓపెనర్లు ఇద్దరూ డకౌట్ అయి మరో రికార్డు నమోదు చేశారు. యశస్వి జైశ్వాల్ వచ్చి రావడమే బాదడానికి చూస్తాడు తప్పించి... కొంచెం అలవాటు పడ్డాక షాట్ కొట్టాలన్న ధ్యాస ఉండదని నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. క్లిక్ అయితే పరుగులు చేయడం.. లేకుంటే వెంటనే అవుట్ కావడంతో యశస్వి జైశ్వాల్ పై క్రికెట్ ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలన్నీ అడియాసలే అవుతున్నాయి. చిన్న వయసులో వచ్చిన అవకాశాన్ని యశస్వి సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడంటూ నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ కామెంట్లు పెడుతున్నారు.

నెటిజన్లు ఫైర్...
శుభమన్ గిల్ అవుట్ అంటే.. అది ఎవరూ ఏమీ చేయలేరు. ఎల్‌.బి.డబ్ల్యూగా వెనుదిరిగాడు. ఇక తిలక్ వర్మ పరవాలేదని పించాడు. మరో బ్యాటర్ కమ్ వికెట్ కీపర్ జితేశ్ శర్మ కూడా దక్కిన అవకాశాన్ని ఏమాత్రం అనుకూలంగా మలుచుకోలేకపోతున్నాడు. ఇలాగయితే వీరిని నమ్మి వరల్డ్ కప్ లో ఎలా ఆడిస్తారంటూ క్రికెట్ ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు. దూకుడుగా ఆడటంలో తప్పు లేదు. కానీ.. తన వెనక బ్యాటర్లు లేరని తెలిసినప్పుడు కూడా అదే రకంగా ఆడుతూ అవుట్ అవుతుండటం నిర్లక్ష్యమనుకోవాలా? లేదా నిలకడ లేని తనమని భావించాలో తెలియడం లేదంటూ అనేక మంది పోస్టులు పెడుతుండటం విశేషం.
ఇన్ని పరుగులా?
ఇక అర్ష్‌దీప్ సింగ్ విషయానికి వస్తే అతగాడి చేతికి బంతి ఇస్తే స్టేడియంలోనే కాదు టీవీ ముందు కూర్చున్న ప్రతి ఒక్క భారతీయ అభిమానికి భయమేస్తుంది. ఎందుకంటే పరుగులే పరుగులు. నిన్న దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో ఒకే ఓవర్ లో 24 పరుగులు సమర్పించుకున్నాడంటే అర్ష్‌దీప్ ను ఎందుకు కొనసాగిస్తున్నారో సెలక్టర్లకే తెలియాలంటూ మండిపడుతున్నారు. అనేక మ్యాచ్ లలో డెత్ ఓవర్లలోనూ సరిగా బౌలింగ్ చేయలేడని అర్ష్ దీప్ సింగ్ కు పేరున్నా అతనిని కొనసాగిస్తుండటంపై అందరూ పెదవి విరుస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా ఇలాంటి ఆటగాళ్లను పక్కన పెడితే తప్ప భారత్ కు విజయాలు లభించవన్న కామెంట్స్ మాత్రం ఎక్కువగా వినిపిస్తున్నాయి. అయితే ఆటలో గెలుపోటములు సహజం. ఒక్కో మ్యాచ్ లో ఒకరు క్లిక్ అయితే మరొకరు ప్లాప్ అవుతారు. అది క్రికెట్ కు ఉన్న నైజం.


Tags:    

Similar News