తక్కువ స్కోరు.. సునాయాస విజయమైనా?
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ 20 మ్యాచ్ లో భారత్ సునాయాస విజయం లభించింది
దక్షిణాఫ్రికాతో జరిగిన టీ 20 మ్యాచ్ లో భారత్ సునాయాస విజయం లభించింది. బౌలర్లు విజృంభించడంతో అతి తక్కువ స్కోరుకే దక్షిణాఫ్రికా జట్టు అవుటయింది. 20 ఓవర్లలో కేవలం 106 పరుగులను మాత్రమే చేసింది. ఎనిమిది వికెట్లను కోల్పోయి భారత్ కు తొలి మ్యాచ్ ను సులువుగా అప్పగించింది. టాస్ గెలిచి భారత్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకుంది. అయితే తొలుత బ్యాటింగ్ కు దిగిన సౌతాఫ్రికా జట్టు వికెట్లు టపా టపా పడిపోయాయి. అర్హదీప్, దీపక్ చహార్ లో విజృంభించడంతో తొలి ఐదు వికెట్లను ఐదు ఓవర్లలోనే ఐదు వికెట్లు తీశారు. తర్ాత కేశవ్ మహారాజ్, మార్‌క్రమ్, పార్నెల్ కొంచెం ఆడటంతో ఆ మాత్రం స్కోరు లభించింది.
తొలుత తడబడినా...
తర్వాత బ్యాటింగ్ కు దిగిన భారత్ తొలి ఓవర్లలో తడబడింది. తొలుత రోహిత్ ఏమీ పరులు చేయకుండానే అవుటయ్యాడు. తర్వాత క్రీజ్ లోకి వచ్చిన కొహ్లి పరిస్థితి దాదాపు అంతే. అయితే రాహుల్, సూర్యకుమార్ యాదవ్ లు నిలకడగా ఆడి భారత్ కు విజయాన్ని తెచ్చిపెట్టారు. కేఎల్ రాహుల్ 51 పరుగులు, సూర్యకుమార్ యాదవ్ 50 పరుగులు చేశారు. భారత్ బౌలర్లలో అర్హదీప్ కు మూడు, దీపక్ చాహర్ కు రెండు, హర్షల్ పటేల్ కు రెండు, అక్షర పటేల్ ఒక వికెట్ తీశారు.