మహ్మద్ అజారుద్దీన్ ఇంట విషాదం

Update: 2022-10-19 01:16 GMT

భారత మాజీ కెప్టెన్‌, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ప్రెసిడెంట్‌ మహ్మద్ అజారుద్దీన్ ఇంట విషాదం నెలకొంది. ఆయన తండ్రి అజీజుద్దీన్ మంగళవారం కన్నుమూశారు. సుదీర్ఘకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో అజీజుద్దీన్ బాధపడుతున్నారు. ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను ఆసుపత్రిలో చేర్చారు. ఆయన పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అజీజుద్దీన్ మరణంలో అజర్ కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. అజర్ తండ్రి అంత్యక్రియలు నేడు నిర్వహించనున్నారు. బంజారాహిల్స్ లోని మసీదులో మతపరమైన కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

బంజారాహిల్స్ లోని మసీద్ ఇ బాకీ జోహార్‌లో నమాజ్ ఇ జనాజా అనంతరం యూసఫ్‌ అంత్యక్రియలు జరుగుతాయని కుటుంబసభ్యులు తెలిపారు. వార్షిక సర్వసభ్య సమావేశం(ఏజీఎమ్‌) కోసం ముంబైకి వెళ్లిన అజర్‌.. తండ్రి మరణవార్త తెలియగానే హుటాహుటిన హైదరాబాద్‌కు బయల్దేరారు.


Tags:    

Similar News