పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ పై యుద్ధం మొదలుపెట్టిన హర్భజన్

అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకుని అక్రమాలకు పాల్పడితే వదిలేది లేదని హెచ్చరించాడు హర్భజన్

Update: 2022-10-08 03:11 GMT

భారత మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్(PCA) పై తన యుద్ధాన్ని మొదలుపెట్టాడు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ చీఫ్ అడ్వైజర్ కొత్త సభ్యత్వాలను అందించడంలో విఫలమయ్యారని.. చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను పాల్పడుతున్నారని ఆరోపిస్తూ హర్భజన్ సింగ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర క్రికెట్ సంఘం బోర్డు సమగ్రతను కాపాడటానికి PCA సభ్యులు, వాటాదారులు కలిసి రావాలని, చట్టవిరుద్ధ కార్యకలాపాలను ఆపాలని హర్భజన్ కోరారు. ప్రపంచ కప్ విజేత మాజీ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్, రాజ్యసభ ఎంపీగా కూడా పనిచేస్తున్నారు. పిసిఎ అధ్యక్షుడు గుల్జారీందర్ సింగ్ చాహల్ చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తనకు గత 10 రోజులుగా ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. ప్రస్తుత అధ్యక్షుడి ఆధ్వర్యంలోని పిసిఎ చాలా చట్టవిరుద్ధమైన కార్యకలాపాలకు పాల్పడుతోందని, పారదర్శకత లోపించిందని పంజాబ్‌లోని క్రికెట్ ప్రేమికుల నుండి నాకు అనేక ఫిర్యాదులు అందుతున్నాయని హర్భజన్ లేఖలో రాశారు.

హర్భజన్ మాట్లాడుతూ పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ లో ఓటింగ్ హక్కులు కలిగిన దాదాపు 150 మంది సభ్యులను తమకు అనుకూలంగా మార్చుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తోందని, అపెక్స్ కౌన్సిల్/జనరల్ బాడీ ఆమోదం లేకుండానే ఈ ప్రవేశాలు జరుగుతున్నాయని హర్భజన్ అన్నారు. దీనికి సంబంధించి తనను సంప్రదించలేదని, ఈ కార్యకలాపాలు బీసీసీఐ రాజ్యాంగానికి, పిసిఎ మార్గదర్శకాలకు, క్రీడా సంస్థల నిర్వహణలో పారదర్శకత, నైతిక నిబంధనల ఉల్లంఘనకు కూడా విరుద్ధమని అన్నారు. పంజాబ్ క్రికెట్ అసోసియేషన్.. పంజాబ్, కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్ లకు గవర్నింగ్ బాడీగా వ్యవహరిస్తున్నది. మాజీ క్రికెటర్, నటుడు గుల్జారీందర్ చాహల్ పీసీఏ చీఫ్ కాగా ఇంద్రజిత్ సింగ్ బింద్రా చైర్మెన్ గా ఉన్నాడు. హర్భజన్ సింగ్ పీసీఏలో చీఫ్ అడ్వైజర్ గా ఉన్నాడు. అధికారాన్ని గుప్పిట్లో ఉంచుకుని అక్రమాలకు పాల్పడితే వదిలేది లేదని హెచ్చరించాడు హర్భజన్.


Tags:    

Similar News