వేట మొదలైంది.. ఫాస్ట్ బౌలర్లు కావాలి

భారత క్రికెట్‌లో తర్వాతి తరం ఫాస్ట్ బౌలర్లను సిద్ధం చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు మొదలుపెట్టింది.

Update: 2025-08-18 11:00 GMT

భారత క్రికెట్ కు ఫాస్ట్ బౌలర్ల అవసరం ఉంది. భారత క్రికెట్‌లో తర్వాతి తరం ఫాస్ట్ బౌలర్లను సిద్ధం చేసేందుకు బీసీసీఐ ప్రణాళికలు మొదలుపెట్టింది. దేశవాళీ సీజన్ ప్రారంభానికి ముందు యువ పేసర్ల కోసం బెంగళూరులో ఒక ప్రత్యేక శిక్షణా శిబిరాన్ని నిర్వహించింది.బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వేదికగా జరిగిన ఈ ఫాస్ట్ బౌలింగ్ డెవలప్‌మెంట్ క్యాంపులో మొత్తం 22 మంది బౌలర్లు పాల్గొన్నారు. ప్రత్యేకంగా గుర్తించిన 14 మంది పేసర్లతో పాటు, అండర్-19 జట్టుకు చెందిన 8 మంది యువ ఆటగాళ్లు ఉన్నారు. జాతీయ క్రికెట్ అకాడమీ ఫాస్ట్ బౌలింగ్ కోచ్ ట్రాయ్ కూలే మార్గదర్శకత్వంలో ఈ శిబిరం జరిగింది. ఇంగ్లండ్ పర్యటనలో టెస్టు అరంగేట్రం చేసిన అన్షుల్ కాంబోజ్‌తో పాటు, హర్షిత్ రాణా, సిమర్‌జీత్ సింగ్, తుషార్ దేశ్‌పాండే వంటి పలువురు యువ ఆటగాళ్లు ఈ క్యాంపులో పాల్గొన్నారు. శ్రేయస్ అయ్యర్, సుయాశ్ శర్మ కూడా ఫిట్‌నెస్ పరీక్షల కోసం హాజరయ్యారు.

Tags:    

Similar News