IPL 2025 : నేడు చెన్నై vs బెంగళూరు
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడుతుంది.
ఐపీఎల్ సీజన్ 18 ఇక తుది దశకు చేరుకుంది. ఇప్పటికే అనేక నాలుగు జట్లు ప్లే ఆఫ్ రేసులోకి దూసుకు వచ్చాయి. ముంబయి, గుజరాత్, బెంగళూరు, పంజాబ్ జట్లు మొదటి నాలుగు స్థానాల్లో ఉండగా, ఢిల్లీ కాపిటల్స్ జట్టు, లక్నో సూపర్ జెయింట్స్ కూడా రేసులో ముందున్నాయి. ఢిల్లీ కాపిటల్స్ జట్టు ఆరంభంలో అదరగొట్టినా తర్వాత మాత్రం వరస ఓటములతో తొలి నాలుగు స్థానాల నుంచి కిందకు దిగింది. దీంతో ఈ ఆరు జట్లలో ఎవరు చివరకు ప్లేఆఫ్ కు చేరుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.
మరో కీలక మ్యాచ్ ...
నేడు ఐపీఎల్ లో మరో కీలక మ్యాచ్ జరగనుంది. చెన్నై సూపర్ కింగ్స్ తో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ తలపడుతుంది. బెంగళూరు వేదికగా రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్ లో వరస ఓటములను చవి చూడటంతో ప్లే ఆఫ్ రేస్ నుంచి దాదాపుగా నిష్క్రమించిందనే చెప్పాలి. ఇక బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ మాత్రం ఇప్పటి వరకూ పది మ్యాచ్ లు ఆడి ఏడు మ్యాచ్ లలో గెలిచి మూడు మ్యాచ్ లలో మాత్రమే ఓడి పథ్నాలుగు పాయింట్లతో పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. చెన్నై పాయింట్ టేబుల్ లో చివరి స్థానంలో ఉంది. అందుకే ఈ మ్యాచ్ లో గెలవడం బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ కీలకమనే చెప్పాలి.