ఎత్తుకొని పెంచితే.. చున్నీ లాగానంటోంది

మాజీ మంత్రి అఖిలప్రియపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఫైర్‌ అయ్యారు. లోకేష్‌ పాదయాత్రలో గ్రూపు రాజకీయాలు చేశారని మండిపడ్డారు.

Update: 2023-05-31 10:49 GMT

మాజీ మంత్రి అఖిలప్రియపై టీడీపీ నేత ఏవీ సుబ్బారెడ్డి ఫైర్‌ అయ్యారు. లోకేష్‌ పాదయాత్రలో గ్రూపు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. టీడీపీ నేత నారా లోకేస్‌ యువగళం పాదయాత్రలో ఏవీ సుబ్బారెడ్డి తన చున్నీ పట్టుకుని లాగరని, తన డ్రెస్సు చిరిగిపోయిందని భూమా అఖిల ప్రియ సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తన అభిమానులు ఏవీ సుబ్బారెడ్డిపై దాడి చేశారని అఖిల ప్రియ తెలిపింది. ఈ ఘటనపై నంద్యాలలో ఏవీ సుబ్బారెడ్డి స్పందించారు. అఖిల ప్రియను భుజాల మీద ఎత్తుకొని పెంచితే.. చున్నీ లాగానని చెప్పడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు.

పార్టీ ఆదేశిస్తే నంద్యాల లేదా ఆళ్లగడ్డలో పోటీ చేస్తానని ప్రకటించారు. అవమానం జరిగింది, దెబ్బలు తగిలింది తనకైతే.. నువ్వు (అఖిలప్రియ) ప్రెస్‌ మీట్‌ పెట్టి తనను తిట్టడం ఏంటని ప్రశ్నించారు. అఖిలప్రియ అనుచరులు కర్నూలు, జమ్మలమడుగు ప్రాంతాలకు చెందిన రౌడీషీటర్లని ఆరోపించారు. ఆ రౌడీషీటర్లను అఖిల తన వెంట ఎందుకు తిప్పుకుంటుందో పోలీసులను అడుగుతానన్నారు. నాగిరెడ్డి బహిరంగ సభల్లో ఏవీ, భూమా వేరు వేరు కాదని తాను ఎన్నో సార్లు చెప్పానన్నారు. భార్గవ్ రామ్ మీద పొలీసులు ఎందుకు రౌడీ షీట్ ఓపెన్ చేయలేదని ఏవీ ప్రశ్నించారు. ఎలాంటి పరిస్థితులు ఎదురైనా పార్టీ వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

ఒక వేళ పార్టీ తనను దూరం పెడితే ఇంట్లో కూర్చొని బాధపడతానే తప్పా.. పార్టీ మారే ప్రసక్తే లేదన్నారు. తాను తప్పు చేస్తే పోలీసులకు ఆధారాలు ఇవ్వాలని అఖిలప్రియకు ఏవీ సవాల్‌ విసిరారు. నంద్యాలలో తెలుగుదేశం పార్టీ ఇంచార్జి భూమా బ్రహ్మనందరెడ్డి, ఫరూక్‌ ఉన్నా కూడా నంద్యాలలో పార్టీ ఆఫీసు పెట్టడం ఏంటన్నారు. లోకేష్‌ పాదయాత్ర సాఫీగా జరిగిందంటే.. అది అఖిలప్రియ వల్ల కాదని, లోకేష్‌పై ఉన్న అభిమానంతోనే ప్రజలు పాదయాత్రలో పాల్గొన్నారని తెలిపారు. తాను ఆళ్లగడ్డలో సొంతంగా టీడీపీ కార్యాలయాలు తెరవగలనని, అయితే తాను పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానన్నారు. 

Tags:    

Similar News