చంద్రబాబును నమ్మొద్దు

గుంటూరులోని తుళ్లూరు వెంకటపాలెంలో ఆర్‌-5 మండలంలో నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం

Update: 2023-05-26 08:04 GMT

గుంటూరులోని తుళ్లూరు వెంకటపాలెంలో ఆర్‌-5 మండలంలో నిరుపేదలకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం ఇంటి పట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సభను ఉద్దేశించి సీఎం జగన్‌ ప్రసంగిస్తూ.. ఈ చొరవ దేశ చరిత్రలో ఎనలేనిదని, నిరుపేదలు తమ నివాసాల కోసం పడుతున్న కష్టాలను స్వయంగా చూశానని ఉద్ఘాటించారు. ప్రతిపక్ష శక్తులు బలీయమైన విరోధుల వలె తమ ప్రయత్నాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారని, అయితే తాము కఠినమైన న్యాయ పోరాటాలు చేసి ఇళ్లు అందిస్తున్నామని తెలిపారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో మోసపూరిత వాగ్దానాలు చేశారని సీఎం జగన్ విమర్శించారు.

‘రాక్షసరాజు నరకాసురుడిని కూడా నమ్మవచ్చు కానీ, నారా చంద్రబాబు నాయుడుని నమ్మలేం’ అన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు పేజీల కొద్దీ మేనిఫెస్టోలు తెస్తారని ఆయన అన్నారు. చంద్రబాబు, పవన్‌ కల్యాణ్‌, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు, టీవీ 5 న్యూస్‌ ఛానెల్‌ను లక్ష్యంగా చేసుకునీ సీఎం జగన్‌ తీవ్ర విమర్శలు చేశారు. వాటిని గజ దొంగల ముఠాగా సీఎం అభివర్ణించారు. చంద్రబాబు అన్ని వర్గాల ప్రజలను మోసం చేశారన్నారు. ఎన్నికల వేళ బాబు మోసపూరిత హామీలు ఇస్తారని, వాటిని ప్రజలేవరూ నమ్మొద్దని కోరారు. తాము ఇచ్చిన హామీలలో 98 శాతం అమలు చేసినట్టు సీఎం తెలిపారు. 30 లక్షల మందికిపైగా అక్కాచెల్లెమ్మలకు పట్టాలు అందించామన్నారు.

మేనిఫోస్టోను భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌గా భావించి అమలు చేస్తున్నామని, తన పాలనలో అవినీతికి, వివక్షకు తావు లేకుండా సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు ఒక్క పట్టా ఇచ్చిన పాపన పోలేదన్నారు. ఇళ్ల స్థలాల విషయంలో ప్రజలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. ఇప్పటి వరకు పంపిణీ చేసిన ఇళ్ల స్థలాలు.. మహిళల పేరు మీదే ఉన్నాయని వివరించారు. మహిళల చేతుల్లో రూ. 2 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల సంపద ఉందని జగన్‌ తెలిపారు. పేదలకు మంచి చేయాలనే ఆలోచన ప్రతిపక్షాలకు లేదన్నారు.

Tags:    

Similar News