అంత అలుసా?

తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అయితే ఈ పదవి నామమాత్రంగానే ఉందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు

Update: 2023-09-18 12:06 GMT

ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. అయితే ఈ పదవి నామమాత్రంగానే ఉందని ఆయన సన్నిహితులు అభిప్రాయపడుతున్నారు. పేరుకు రాష్ట్ర అధ్యక్షుడయినా నిర్ణయాల్లోనూ ఆయన కనీసం అవకాశం కల్పించకపోవడాన్ని తప్పుపడుతున్నారు. ముఖ్యంగా బీసీల మనోెభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయన్నది అచ్చెన్న అనుచరుల ఆవేదన. ఏ విషయంలోనూ సంప్రదింపులు జరపకుండా పార్టీ నాయకత్వం ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుండటమే కాకుడా కనీసం మాట మాత్రంగానైనా అచ్చెన్నతో చెప్పకపోవడం బీసీల మనోభావాలను దెబ్బతీసేవిధంగా ఉన్నాయన్న కామెంట్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.

బాబు జైలు కెళితే…
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలెప్‌మెంట్ స్కాం కేసులో జైలుకెళితే పార్టీ పరిస్థితులు, కార్యాచరణపై చర్చించేటప్పుడు కూడా అచ్చెన్నను దూరం పెట్టారంటున్నారు. కేవలం బాలకృష్ణ సీనియర్ నేతలతో చర్చించి కనీసం అచ్చెన్నాయుడుకు ఆహ్వానం కూడా లేదని చెబుతున్నారు. కేవలం చంద్రబాబు నిర్ణయాలను లెటర్ హెడ్ లపై ఉంచి సంతకాలు చేయించడం మినహా అచ్చెన్న ఉద్యోగం అంత వరకే అన్నది బీసీలను కించపర్చే విధంగా ఉందని ఒక వర్గం నేతలు అభిప్రాయపడుతున్నారు. చంద్రబాబు తర్వాత లోకేష్ ఉన్నప్పటికీ ఆయన రాజమండ్రి, ఢిల్లీలో ఉంటూ బిజీగా ఉంటున్నారు. కానీ అచ్చెన్నను మాత్రం పట్టించుకోలేదు.
పొత్తు అంశాలపై…
అంతేకాదు కీలకమైన పొత్తు అంశాలపై కూడా అచ్చెన్నతో చర్చించకుండానే అధికారిక ప్రకటన విడుదలయిందని అంటున్నారు. బీసీలను పక్కన పెట్టి కాపులను దగ్గరకు తీసుకునే ప్రయత్నమే టీడీపీ హైకమాండ్‌లో కనిపిస్తుంది తప్పించి ఆది నుంచి పార్టీకి అండగా ఉన్న బీసీలను మాత్రం పట్టించుకోవడం లేదన్న కామెంట్స్ పార్టీ క్యాడర్ నుంచే వినిపిస్తున్నాయి. పవన్ కల్యాణ‌్ కారణంగా ఎన్ని ఓట్లు వస్తాయో లేదో తెలియదు కానీ ఈ చర్యల వల్ల బీసీ ఓటు బ్యాంకు క్రమంగా పార్టీకి దూరమయిపోతుందన్న ఆందోళన, ఆవేదన సీనియర్ నేతల్లో కనిపిస్తుంది. ప్రాంతీయ పార్టీల్లో ఇది సహజమే అయినా ఎన్నికల సమయంలోనైనా అచ్చెన్నకు కీలక నిర్ణయాల్లో ప్రాధాన్యత ఇస్తే బాగుంటుందన్న సూచనలు వినపడుతున్నాయి. 
బీసీలను పక్కన పెట్టి…
తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పార్టీకి బీసీలకు వెన్నుదన్నుగా నిలిచారు. బీసీల పార్టీగా ముద్రపడింది. అలాంటి బీసీలను పవన్ కారణంగా దూరం చేసుకుంటున్నారన్న కామెంట్స్ పార్టీలోని బీసీ నేతల్లో వ్యక్తమవుతుంది. కాపులకు ఇచ్చిన ప్రయారిటీ బీసీ నేతలకు ఇవ్వడం లేదని, అచ్చెన్నాయుడును అధ్యక్షుడిగా పేరుకు మాత్రమే ఉంచారని, అంతా కాపులతో చేరి కధను కానిచ్చేస్తున్నారన్న కోసం, ఆగ్రహం కూడా నేతల్లో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో టీడీపీ హైకమాండ్ కొంత నష్ట నివారణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. లేకుంటే రాష్ట్రంలో అత్యధిక శాతం ఉన్న బీసీ జనాభా దూరమయ్యే అవకాశాలున్నాయన్న వార్నింగ్ బెల్స్ టీడీపీకి వినిపిస్తున్నాయనడంలో ఏమాత్రం సందేహం లేదు.


Tags:    

Similar News