'బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలంతా వనమాలే'.. షర్మిల సంచలన ఆరోపణలు

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు అంతా మరో వనమాలే అంటూ

Update: 2023-07-26 12:24 GMT

బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలపై వైఎస్‌ఆర్‌టీపీ అధినేత్రి వైఎస్‌ షర్మిల తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్‌ఎస్‌లో ఉన్న ఎమ్మెల్యేలు అంతా మరో వనమాలే అంటూ కామెంట్‌ చేశారు. అంతా ఎన్నికల కమీషన్‌ని తప్పు దోవ పట్టించిన వాళ్లేనని ఆరోపించారు. దొరల్లా చెలామణి అవుతూ దొరక్కుండా తిరుగుతున్న దొంగలంటూ వ్యాఖ్యానించారు. ఎన్నికల అఫిడవిట్లో చూపింది గోరంతైతే దాచింది కొండంత అని, లెక్కకు రాని ఆస్తులు, అంతస్తులు అనంతం అని అన్నారు. అధికార పార్టీ ఎమ్మెల్యేల అఫిడవిట్లు తక్షణం తనిఖీ చేసి, తప్పుడు సమాచారం ఇచ్చిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి వైఎస్‌ఆర్‌ తెలంగాణ పార్టీ విజ్ఞప్తి చేస్తుందన్నారు.

ఎన్నికల సంఘాన్ని మోసం చేసి అధికారం అనుభవిస్తున్న వారిని మళ్లీ పోటీకి అనర్హులుగా ప్రకటించాలని కోరుతున్నామన్నారు. బీఆర్ఎస్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు ఎన్నిక చెల్లదంటూ తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే. తన పదవీ కాలానికి ఇంకా నాలుగు నెలలు మిగిలి ఉన్న సమయంలో.. తెలంగాణలోని కొత్తగూడెం నుండి భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావుపై హైకోర్టు అనర్హత వేటు వేసింది. ఆయన స్థానంలో 2018 ఎన్నికల్లో రన్నరప్ అభ్యర్థి జలగం వెంకట్ రావు ఎన్నికైనట్లు ప్రకటించారు. వాస్తవానికి కాంగ్రెస్ అభ్యర్థిగా ఎన్నికైన వనమా వెంకటేశ్వరరావు, ఫిరాయింపుల నిరోధక చట్టం కింద చర్య తీసుకోకుండా తప్పించుకుని మరో 12 మంది ఎమ్మెల్యేలతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు.

ఎన్నికల్లో ఓడిపోయిన అభ్యర్థి జలగం వెంకట్రావు.. ఎన్నికల కమిషన్‌కు సమర్పించిన అఫిడవిట్‌లో వెంకటేశ్వరరావు, అతని భార్యకు చెందిన ఆస్తి వివరాలను పూర్తిగా వెల్లడించలేదని ఆరోపిస్తూ కోర్టులో కేసు వేశారు. విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు.. కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరావు ఎన్నిక చెల్లదంటూ మంగళవారం సంచలన తీర్పు వెలువరించింది. మరోవైపు తన ఎన్నిక చెల్లదంటూ ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని.., సుప్రీంకోర్టు వెళ్లేందుకు తనకు సమయం కావాలని పిటిషన్‌లో కోరారు. వాదనలు విన్న న్యాయస్థానం.. మంగళవారం ఇచ్చిన తీర్పును రిజర్వు చేసింది.

Tags:    

Similar News