Revanth Reddy : వచ్చే వందరోజులూ గడ్డు రోజులే.. రేవంత్ సామర్థ్యానికి పరీక్ష

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు.

Update: 2023-12-15 12:56 GMT

loksabha elections

రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అందరినీ కలుపుకుని ముందుకు సాగుతున్నారు. పాలనలో కూడా కొత్త దారిలో వెళుతున్నారు. ప్రజలకు అత్యంత చేరువగా ప్రభుత్వంతో పాటు పార్టీని చేరవేసేందుకు ఆయన కృషి చేస్తున్నారనే చెప్పాలి. ప్రజావాణి కార్యక్రమం ప్రారంభం దగ్గర నుంచి ఆరు గ్యారంటీలలో రెండు గ్యారంటీలను అమలు పర్చి ప్రజల్లో విశ్వాసాన్ని పొందగలిగారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కంటే ఇప్పుడు ఆయన పూర్తిగా పరిణితిని ప్రదర్శిస్తున్నారు. ప్రతిపక్ష నేత కేసీఆర్ ను ఆసుపత్రిలో పరామర్శించడంతో ఆయనకు అదనంగా పాయింట్లు చేరి మరింత బలోపేతమయ్యారనే చెప్పుకోవాలి. అయితే మరో మూడు నెలల్లో ముప్పు పొంచి ఉంది.

లోక్‌సభ ఎన్నికలకు...
లోక్‌సభ సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. మరో మూడు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్న వేళ ఎక్కువ స్థానాలను గెలిపించడం పీసీసీ చీఫ్ గా, ముఖ్యమంత్రిగా ఆయనపై పెద్ద బాధ్యతే ఉందని చెప్పాలి. మూడు నెలల్లో జరుగుతున్న లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గరిష్టంగా పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాల్సి ఉంటుంది. గతంలో వేరు. ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి + పీసీసీ చీఫ్. ఎన్నికల ఫలితాలకు పూర్తిగా ఆయనే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ఏమాత్రం ఫెయిలయినా ప్రభుత్వంపై వ్యతిరేకత మూడు నెలల్లోనే వచ్చిందన్న సంకేతాలు ఢిల్లీకి చేరే ప్రమాదం మాత్రం పొంచి ఉందనే చెప్పాలి.
అంతా తానే అయి...
అందుకే అభ్యర్థుల ఎంపిక దగ్గర నుంచి ప్రచారం వరకూ అంతా తానే అయి చూసుకోవాల్సి ఉంటుంది. మరొకరిపై ఫెయిల్యూర్ ను నెట్టే అవకాశాలు ఎంత మాత్రం లేవు. అయితే ఈలోపు ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు ఎన్నికల మ్యానిఫేస్టోను మొత్తం గ్రౌండ్ చేయాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతమున్న పరిస్థితుల్లో రేవంత్ కు అది ఆషామాషీ విషయం కాదు. ఆర్థిక పరిస్థితి బహుశ సహకరించే అవకాశం ఉంటుందని భావించలేం. అప్పులు చేయాల్సి ఉంటుంది. ఇలా అప్పులు చేయడానికి కేంద్ర ప్రభుత్వం ఎఫ్ఆర్‌బీఎం పరిమితులకు లోబడి మాత్రమే అనుమతులు మంజూరు చేస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలనే కేంద్రంలో ఉన్న బీజేపీ చేస్తుంది. అందుకే రేవంత్ కు పాలనతో పాటు హామీల అమలు కత్తిమీద సామే అవుతుందన్నది ఆర్థిక విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది.
సాకులు చెబితే...
అలాగని లోక్ సభ ఎన్నికలకు మూడు నెలల తర్వాత కూడా తాము ఇచ్చిన హామీలను ఇంకా అమలు చేస్తామని చెప్పడం కుదరని పని.సాకులు చెబితే ఊరుకోరు. ఎందుకంటే వంద రోజుల్లోనే హామీలను, ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని ప్రజలకు మాట ఇచ్చి మరీ అధికారంలోకి వచ్చారు. ఇటు పార్టీ హైకమాండ్ నుంచి కూడా వత్తిడి ఉంటుంది. అన్నింటికీ బాధ్యత తానే తీసుకోవాల్సి ఉంటుంది. ఢిల్లీ నుంచి పరిశీలకులు దిగుతారు. వారి నుంచి కూడా వత్తిడి రానుంది ఇన్ని వత్తిడుల మధ్య రేవంత్ లోక్‌సభలను ఎదుర్కొనాలి. అంతే స్థాయిలో అత్యధిక స్థానాల్లో పార్టీకి విజయం అందించాలి. అప్పుడే రేవంత్ నాయకత్వాన్ని కూడా హైకమాండ్ విశ్వసిస్తుంది. పదవి పదిలంగా ఉంటుంది. అందుకే రానున్న వంద రోజులు ముఖ్యమంత్రి రేవంత్ కు గడ్డు కాలమేనన్నది విశ్లేషకుల అంచనాగా వినిపిస్తుంది.
Tags:    

Similar News