ఢిల్లీలో యమునా నది ఉధృతి

ఢిల్లీలో యమునా నది ఉధృతిగా కొనసాగుతుంది. డేంజర్‌ మార్క్‌ దాటి యమునా నది ప్రవాహం కొనసాగుతుంది.

Update: 2025-08-31 04:36 GMT

ఢిల్లీలో యమునా నది ఉధృతిగా కొనసాగుతుంది. డేంజర్‌ మార్క్‌ దాటి యమునా నది ప్రవాహం కొనసాగుతుంది. పాత రైల్వే బ్రిడ్జి దగ్గర 205.52 మీటర్ల నీటిమట్టానికి చేరుకుంది. నీటిమట్టం మరింత పెరిగే అవకాశం ఉండటంతో యమునా నది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అలెర్ట్ చేసింది.

సురక్షిత ప్రాంతాలకు...
యమునానది ప్రవాహం తీవ్రం కావడంతో పరివాహక ప్రాంతాల్లో సురక్షిత ప్రాంతాలకు ప్రజలను తరలించారు. ముంబై-మేరఠ్‌ ఎక్స్‌ప్రెస్‌ వేతో పాటు, మయూర్‌ విహార్‌లో శిబిరాలు ఏర్పాటు చేశారు. పునరావాస కేంద్రాల్లో తరలించిన ప్రజలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. నదిలోకి ఎవరూ వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.


Tags:    

Similar News