Cruise : విశాఖలో క్రూయిజ్ నౌక.. చూసేందుకు ఎగబడిన జనం

ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రూయిజ్ విశాఖ పోర్టుకు ఆదివారం చేరుకుంది. దీనిని తిలకించేందుకు వేల సంఖ్యలో జనం వచ్చారు

Update: 2024-04-29 02:31 GMT

ప్రపంచంలోనే అతి పెద్దదైన క్రూయిజ్ విశాఖ పోర్టుకు ఆదివారం చేరుకుంది. దీనిని తిలకించేందుకు వేల సంఖ్యలో జనం వచ్చారు. అత్యంత ఆధునిక సౌకర్యాలతో ఈ నౌక నిర్మితమయింది. అత్యంత విలాసమైన ఈ నౌకలో అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. క్రూయిజ్ లో ప్రయాణించే పర్యాటకుల కోసం ప్రత్యేకంగా దీనిని ఏర్పాటు చేశారు. విలాసవంతమైన ఈ క్రూయిజ్ నౌక అంటార్కిటికా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఆసియా, అమెరికా ఖండాలలో పర్యటించనుంది. క్రూయిజ్ లో ప్రయాణం చేస్తుంటే ఆ అనుభూతి వేరు. ఆ కిక్కే వేరు. ఇందులో ఒక్కసారి ప్రయాణిస్తే చాలు జీవితం ధన్యమయినట్లేనని పర్యాటకులు భావిస్తుందటారు.

80 మందితో కూడిన...
ప్రపంచ పర్యటన చేస్తున్న ఈ క్రూయిజ్ లో 80 మంది పర్యాటకులున్నారు. వీరంతా విశాఖపట్నంలోని పలు ప్రాంతాలను నిన్న, నేడు సందర్శించనున్నారు. ఈ క్రూయిజ్ లో 167 విలాసవంతమైన గదులున్నాయి. ఇప్పటి వరకూ ఈ క్రూయిజ్ 120 దేశాలలో పర్యటించింది. వెయ్యికి పైగా పోర్టుల్లో లంగరు వేసుకుంది. 2024 ప్రపంచ యాత్రకు బయలుదేరిన బృందం ఈ క్రూయిజ్ లో ప్రయాణిస్తున్నారు. అన్ని దేశాలను క్రూయిజ్ లో చుట్టిరావడం మధురానుభూతి. జీవితంలో ఒక్కసారి అయినా ఈ క్రూయిజ్ లో ప్రయాణించాలన్ని ప్రతి ఒక్క పర్యాటకుడి కోరికక.
సంస్కృతులు.. సంప్రదాయాలు...
ఈ నౌకలో ప్రయాణం అనేక దేశాల సంస్కృతులు, సంప్రదాయాలను కూడా తెలుసుకునే అవకాశముండటంతో ఈ క్రూయిజ్ లో పర్యటించడానికి ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తారు. ఈ క్రూయిజ్ లో ప్రయాణిస్తుంటే సముద్రంలో ఉన్నట్లే అనిపించదు. కాస్మోపాలిటిన్ నగరంలో తిరుగుతున్న అనుభూతి కలుగుతుంది. అందుకే ఈ క్రూయిజ్ కు అంతటి డిమాండ్. రెండు, మూడేళ్లకు ఒకసారి విశ్వ వ్యాప్త పర్యటనకు ఈ క్రూయిజ్ బయలుదేరి వెళుతుంది. ఈరోజు విశాఖ నుంచి బయలుదేరి సింగపూర్, మలేషియా, ధాయ్‌లాండ్, కంబోడియా, వియత్నాం మీదుగా ప్రయాణం చేస్తుంది. ఈ క్రూయిజ్ ను బయట నుంచి చూసేందుకు విశాఖ బీచ్ కు పర్యాటకులు పోటెత్తారు.



Tags:    

Similar News