నన్ను ఆత్మహత్య చేసుకోనివ్వండి : మహిళ న్యాయమూర్తి

తనను ఆత్మహత్యకు అనుమతివ్వాలని మహిళ న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ కు లేఖ రాయడం సంచనలం కలిగించింది

Update: 2023-12-15 06:05 GMT

 woman judge

తనను ఆత్మహత్యకు అనుమతివ్వాలని మహిళ న్యాయమూర్తి కోరడం సంచనలం కలిగించింది. సీనియర్ న్యాయమూర్తి లైంగిక వేధింపులు తాళలేక ఆత్మహత్యకు కోరుతూ చీఫ్ జస్టిస్ ను అభ్యర్థించడం న్యాయ చరిత్రలో కలకలం సృష్టించింది. ఉత్తర్‌ప్రదేశ్ లోని బందా జిల్లా మహిళ న్యాయమూర్తి ఈ మేరకు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకు ఈ మేరకు లేఖ రాశారు.

చీఫ్ జస్టిస్ కు ....
తాను చాలా కాలంగా వేధింపులకు గురవుతున్నానని, తనను ఒక చెత్తలా చూశారని, అందువల్ల గౌరవంగానే తన జీవితానికి ఫుల్ స్టాప్ పెట్టాలని నిర్ణయించుకున్నానని చీఫ్ జస్టిస్ కు రాసిన లేఖలో పేర్కొన్నారు. అందుకు అనుమతివ్వాలని ఆమె కోరారు. దీంతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వెంటనే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. అలహాబాద్ హైకోర్టుకు సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్ లేఖ రాశారు.


Tags:    

Similar News