15 ఏళ్లు దాటిన వాహనాలు ఇక తుక్కే

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లక్షలాది వాహనాలు తుక్కుకింద మారనున్నాయి

Update: 2023-01-31 06:51 GMT

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో లక్షలాది వాహనాలు తుక్కుకింద మారనున్నాయి. పదిహేనేళ్లు దాటిన వాహనాలను ఇకపై రోడ్లపై అనుమతించబోరు వాటికి ఇక ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు కూడా ఆర్టీఏ అధికారులు ఇచ్చే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కారణంగా పదిహేను దాటిన వాహనాలు ఇకపై రోడ్డుపై తిరగకూడదు.

పర్యావరణ పరిరక్షణ కోసం...
పర్యావరణ పరిరక్షణ కోసమే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. ఇక ప్రభుత్వ రం సంస్థల్లోనూ పదిహేను ఏళ్లు దాటిన వాహనాలున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన తొమ్మిది లక్షలకు పైగా వాహనాలు స్క్రాప్ కింద మారనున్నాయి. ఏప్రిల్ ఒకగో తేదీ నుంచి ఈ వాహనాలను తుక్కుగా మార్చనున్నారు. వాటిస్థానంలో కొత్త వాహనాలను కొనుగోలు చేసుకోవాలని ఇప్పటికే సంబంధిత శాఖలకు ఆదేశాలు వెళ్లాయి.


Tags:    

Similar News