భారత దేశంలో పాల కొరత ఉండదా?

భారతదేశంలో పాలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది లక్షలు సంపాదిస్తూ ఉన్నారు.

Update: 2025-07-17 09:00 GMT

NDRI

భారతదేశంలో పాలకు ఎంత డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎంతో మంది లక్షలు సంపాదిస్తూ ఉన్నారు. ఇప్పుడు మరో గొప్ప ఆవిష్కరణ భారతదేశంలో చోటు చేసుకుంది. హర్యానాలోని జాతీయ డెయిరీ పరిశోధన సంస్థలో శాస్త్రవేత్తలు డెయిరీ రంగంలో చరిత్ర సృష్టించారు. భారతదేశంలో పెరుగుతున్న పాల డిమాండ్‌ను తీర్చే ప్రయత్నంలో భాగంగా క్లోనింగ్ టెక్నాలజీ సాయంతో చేసిన ప్రయత్నాలు సత్ఫలితాలు ఇచ్చాయి. క్లోనింగ్ సాంకేతికత ద్వారా 'గంగ' అనే ఆవు అండాల సాయంతో మరొక ఆవు ఆరోగ్యకరమైన లక్షణాలతో ఆడ దూడకు జన్మనిచ్చింది. మనుషుల్లో ఐవీఎఫ్ తరహాలో జంతువుల్లో క్లోనింగ్ సాంకేతికతను తీసుకొచ్చారు. ఒక ఆవు IVF ద్వారా దూడకు జన్మనివ్వడం దేశంలో ఇదే మొదటిసారి. ఒక ఉన్నత జాతి ఆవు నుంచి పెద్ద సంఖ్యలో ఆడ దూడలు జన్మించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దేశ డెయిరీ రంగంలో పాల ఉత్పత్తిని భారీగా పెంచనుంది.

Tags:    

Similar News