పెద్దగా హారన్ కొట్టే డ్రైవర్ ను ఈ పోలీసు ఏం చేశాడంటే?
రోడ్డుపైన వెళ్తుంటే కొన్ని భారీ వాహనాలు అదే పనిగా హారన్ కొడుతుంటూ శబ్దకాలుష్యానికి దిగుతారు
రోడ్డుపైన వెళ్తుంటే కొన్ని భారీ వాహనాలు అదే పనిగా హారన్ కొడుతుంటూ శబ్దకాలుష్యానికి దిగుతారు. అది కొందరికి అలవాటు. దీనివల్ల ఎక్కువ మంది ఇబ్బంది పడుతుంటారు. వాహనాల డ్రైవర్లకు క్లాస్ పీకినా వారి ధోరణిని మార్చుకోరు. సైడ్ ఇవ్వాలన్నా పెద్దగా హారన్ కొడుతూ ముందు వెళుతున్న వారిని భయపెట్టే రేంజ్ లో వెళుతుండటం అనేక సార్లు గమనిస్తుంటాం. ఇటువంటి సంఘటనలు అందరికీ ఎదురయ్యేవే.
కర్ణాటకలో బస్సు డ్రైవర్ ను...
చివరకు నగరంలోనూ ఇలా హారన్ లు కొడుతూ శబ్ద కాలుష్యానికి దిగేవారు అనేక మంది ఉన్నారు. అయితే కర్ణాటకలో ఇలా పెద్దగా హారన్ కొడుతూ వెళుతున్న బస్సు డ్రైవర్ కు ట్రాఫిక్ పోలీసు సరైన రీతిలో గుణపాఠం చెప్పారు. ఓ డ్రైవర్‌కు కర్ణాటక ట్రాఫిక్ పోలీస్ విధించిన పనిష్మెంట్‌పై ప్రశంసలు కురుస్తున్నాయి. అతడి బస్సు ముందే కూర్చొపెట్టి హారన్ కొట్టడంతో సదరు డ్రైవర్ సౌండ్ భరించలేకపోయాడు. 'నువ్వు కొట్టినప్పుడు కూడా ప్రజలకు ఇలాగే ఉంటుంది' అంటూ డ్రైవరు వార్నింగ్ ఇచ్చాడు. అలా అతినికి ఆ శబ్దం వల్ల ఇబ్బందిని తెలియజేసి పంపారు. ఇలా అందరికీ వెరైటీ శిక్షలు వేస్తే బాగుంటుంది కదా?