బ్యాడ్ న్యూస్.. భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర

ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఆయిల్ కంపెనీలు గ్యాస్, పెట్రోలు ధరలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటాయి

Update: 2023-10-01 03:43 GMT

ఒకటో తేదీ వచ్చిందంటే చాలు ఆయిల్ కంపెనీలు గ్యాస్, పెట్రోలు ధరలను సమీక్షించి నిర్ణయం తీసుకుంటాయి. తాజాగా ఈరోజుు గ్యాస్ సిలెండర్ ధరలను భారీగా పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. అయితే డొమెస్టిక్ సిలిండర్ మీద కాదు. వాణిజ్య సిలిండర్ మీద ధరలు పెంచుతూ చమురు సంస్థలు ఉత్తర్వులు జారీ చేశాయి.

నేటి నుంచి అమలు...
వాణిజ్య ఎల్.పి.జి. గ్యాస్ సిలిండర్ ధరపై రూ.209 రూపాయలకు పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. నేటి నుంచే పెరిగిన ధరలు అమలులోకి రానున్నాయి. దీంతో కమర్షియల్ సిలిండర్ ధర ఢిల్లీలో రూ1522 నుంచి రూ.1731లకు పెరిగింది. చెన్నైలో మాత్రం రూ.1898లకు చేరుకుంది. పెరిగిన ధరలు నేటి నుంచి అమలులోకి రానున్నాయి.


Tags:    

Similar News