నేడు ప్రధానితో మమత భేటీ

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఆయనతో రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నారు.

Update: 2022-08-05 03:20 GMT

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ నేడు ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారు. ఆయనతో రాష్ట్ర సమస్యలపై చర్చించనున్నారు. నాలుగురోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ చేరుకున్న మమత బెనర్జీకి ఈరోజు ప్రధాని అపాయింట్‌మెంట్ లభించింది. సాయంత్రం 4.30 గంటలకు ప్రధానిని కలసి జీఎస్టీ బకాయీలపై చర్చించనున్నారు. పశ్చిమ బెంగాల్ కు రావాల్సిన పెండింగ్ లో ఉన్న జీఎస్టీ బకాయీలను వెంటనే విడుదల చేయించాలని ప్రధానిని ఈ సందర్బంగా మమత బెనర్జీ చదువుకున్నారు.

రాష్ట్రపతిని....
ఈరోజు ఆరు గంటలకు నూతన రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా కలవనున్నారు. మర్యాదపూర్వకంగా కలసి ఆమెకు అభినందనలు తెలపనున్నారు. దీంతో పాటు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో కూడా మమత బెనర్జీ సమావేశమయ్యే అవకాశాలున్నాయి. ఈడీ విచారణ పేరుతో వేధింపులకు పాల్పడుతున్న సమయంలో ఆమెకు మద్దతు ఇచ్చేందుకు ప్రత్యేకంగా మమత సోనియాను కలుస్తారని చెబుతున్నారు.


Tags:    

Similar News